Movie News

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో భాగం కూడా రీమేక్ చేసి ఉంటే సిరీస్ పరిపూర్ణం కావడంతో పాటు కమర్షియల్ గా కూడా నాలుగు డబ్బులు వచ్చేవని. కానీ నిజం చెప్పాలంటే వెంకీ దీనికి దూరంగా ఉండటమే మంచిదయ్యింది. ఎందుకంటే వెంకీ, సురేష్ బాబు నిజంగా ఓకే చెప్పి ఉంటే వాళ్ళు జీతూ జోసెఫ్ వెర్షన్ కు ఓటు వేసేవాళ్ళు తప్పించి అజయ్ దేవగన్ టీమ్ రాసిన కొత్త స్టోరీకి కాదు.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ముందు నుంచి రీమేకుల విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. ఒరిజినల్ సోల్ చెడిపోకుండా వీలైనంత దాన్నే ఫాలో కావడానికి ప్రాధాన్యం ఇస్తుంది. అలా జరిగిన పక్షంలో దృశ్యం 3లో మోహన్ లాల్ ఏమేం చేశాడో ఇక్కడ వెంకటేష్ కూడా అదే చేయాల్సి వచ్చేది. అప్పుడు టీవీ సీరియల్ స్క్రీన్ ప్లేతో పాటు క్లైమాక్స్ లో చిరాకు తెప్పించిన ట్విస్టులు మనకు మైనస్ అయ్యేవి. ఇవన్నీ ముందుగా గుర్తించే హిందీ దృశ్యం 3కి పూర్తిగా వేరే స్క్రిప్ట్ రాసుకుని మంచి పని చేశారు.

ఇక భవిష్యత్తులో దృశ్యం 4 వచ్చే ఛాన్స్ లేదు. ది కంక్లూజన్ అని చెప్పేశారు కాబట్టి ఇకపై కొనసాగింపు ఉండదు. మలయాళంలో ఏమైనా ట్రై చేసినా మనోళ్లు ఈసారి లైట్ తీసుకుంటారు. మూడో భాగం ఫలితం వల్ల ఈ ఫ్రాంచైజ్ మీద ఆసక్తి తగ్గిపోయింది. ఏమైనా అజయ్ దేవగన్ మాత్రం అదృష్టవంతుడు. స్క్రిప్ట్ మార్చుకున్నా, అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ ఆహ్లావత్ ని తీసుకున్నా గొప్ప ఫలితాలు వచ్చాయి. మైనస్ అవుతాయని భయపడినవి ప్లస్ అయ్యాయి.

ఇది పక్కన పెడితే వెంకటేష్ వచ్చే వారం ఆదర్శ కుటుంబం ఏకె 47తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తర్వాత మూడు నెలలు తిరగకుండానే జనవరి 12 విడుదలతో మరోసారి థియేటర్లకు వస్తారు. ఈ రెండు కనక హిట్ అయితే వెంకీ హ్యాట్రిక్ జోష్ మరింత హుషారుగా మారడం ఖాయం. దృశ్యం 3 ఎందుకు చేయలేదనే లోటు మొన్నటిదాకా ఫ్యాన్స్ కి అసలు లేదు కానీ హిందీలో చూశాక మటుకు ట్రై చేసి ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నారు. అందులో నిజం లేకపోలేదు.

This post was last modified on October 4, 2026 4:07 pm

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

2 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

4 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

4 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

5 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

5 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

8 hours ago