Political News

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నా… వారి ఇష్టా ఇస్టాలతో సంబంధం లేకుండా కూటమి సర్కారు పోలీసు బలగాలను మోహరించి ఆయా భూములను బలవంతంగా లాక్కుందన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. పెద్ద సంఖ్యలో రైతుల భూములను లాక్కునేందుకు అధికారులు పోలీసులతో కలిసి రాగా.. వారిని రైతులు అడ్డుకున్నారని, రైతులను పోలీసులు లాగి పడేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. మరి ఈ వ్యవహారంలో జరిగిన అసలు విషయమేమిటన్న దానిలోకి వస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

అమరావతి పరిధిలోని ఉండవల్లి పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం కొంత భూమి అవసరం కాగా… దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇదివరకే ప్రభుత్వం జారీ చేసింది. ఉండవల్లిలోని కేవలం 2.77 ఎకరాల భూమి సేకరణ కోసం ఈ నోటిఫికేషన్ జారీ కాగా… ఆ భూమికి పరిహారంగా రూ.7.68 కోట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిహారాన్ని బాధిత రైతులకు అందించేందుకు శుక్రవారం రాత్రే అధికారులు యత్నించగా… వారు పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో సదరు పరిహారాన్ని అధికారులు విజయవాడలోని ఎల్ ఎల్ఆర్ఆర్ లో డిపాజిట్ చేశారు.

ఇక గడువు ముగిసినా రైతుల నుంచి స్పందన కనిపించకపోవడంతో అదికారులు ఆయా భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా అదికారులు పోలీసు బలగాలతో అక్కడికి వెళ్లారు. భూములను స్వాధీనం చేసుకునే సమయంలో 2.77 ఎకరాలకు చెందిన 10 మంది రైతులు అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య ఓ మోస్తరు పెనుగులాట జరిగింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎట్టకేలకు భూసేకరణ పూర్తి అయ్యింది. ఫలితంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగినట్టైంది.

అమరావతి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే పనిలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ భారీ ప్రకటనను విడుదల చేశారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే భూములను లాక్కుంటున్నారని సదరు ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. అయితే రైతులకు పరిహారాన్ని ప్రకటించి.. ఆ పరిహారాన్ని రైతులకు అందజేసేందుకు వెళ్లగా… నిరాకరణ ఎదురైన విషయాన్ని అదికారులు బయటపెట్టడంతో జగన్ ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది.

This post was last modified on July 12, 2026 6:33 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

5 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

5 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago