Movie News

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్ పాత్ర కోసం అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడ‌ని చెబుతూ.. ఈ సినిమాలో కొత్త అఖిల్ క‌నిపిస్తాడ‌న్నాడు. అఖిల్‌ను ఒక మామూలు ప‌ల్లెటూరి కుర్రాడిగా చూపించ‌డ‌మే పెద్ద ఛాలెంజ్ అని.. త‌న ఒంటి రంగు, ఓవ‌రాల్ లుక్ ప్ర‌కారం చూస్తే అలాంటి పాత్ర‌లో ఒప్పించ‌డం క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌న్నాడు.

అఖిల్ చూడ్డానికి చాలా తెల్ల‌గా క‌నిపిస్తాడ‌ని.. బాగా డ‌బ్బున్నోడిలా అనిపిస్తాడ‌ని.. లెనిన్ సినిమాలో మాత్రం ఆ ఫీలింగ్ రాకుండా చూశామ‌ని… త‌న ఒంటి రంగుతో పాటు అన్నీ మార్చేశామ‌ని.. ఈ పాత్ర‌కు అత‌ను సూట‌బుల్ అని ప్రేక్ష‌కుల‌తో అనిపిస్తామ‌ని నాగ‌వంశీ అన్నాడు.

లెనిన్ సినిమా చూశాక నాగ‌వంశీ మాట‌ల‌తో ఏకీభ‌వించాల్సిందే అనిపిస్తుంది. లెనిన్ పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి అఖిల్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెర మీద ప్ర‌తి స‌న్నివేశంలోనూ క‌నిపిస్తూనే ఉంటుంది. అత‌ను రిచ్ కిడ్ అని, ముట్టుకుంటే మాసిపోతాడు అనే ఫీలింగ్ ఎక్క‌డా రాదు. నాగార్జున అన్నట్లు అఖిల్ ఇప్పటిదాకా చేసింది అర్బన్ సినిమాలే చేసిన నేపథ్యంలో మహాభారత నేపథ్యంలో సాగే విలేజ్ డ్రామాలో అఖిల్ ను ఊహించుకోవడం కష్టమే. 

ఐతే ప్రోమోల్లోనే అఖిల్ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తన ట్రాన్స్ఫర్మేషన్ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు సినిమాలో ఓవరాల్ గా తన గెటప్, బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ అన్ని కూడా బాగా కుదిరాయి అనిపించింది. నటనలోనూ పరిణతి కనిపించింది.

ఈ పాత్రకు అతను సూట్ కాలేదు అనిపించడమే ఈ సినిమా విషయంలో అఖిల్ సాధించిన అతి పెద్ద విజయం. నటుడిగా అదరగొట్టేశాడు అని చెప్పలేం కానీ డిసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సినిమా కమర్షియల్ గా బాగానే ఆడేలా కనిపిస్తుండటంతో అక్కినేని కుర్రాడి నిరీక్షణకు తెర పడే అవకాశాలు ఉన్నాయి.

This post was last modified on July 11, 2026 8:11 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago