Movie News

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట అన్నారు. స్పైడర్ మ్యాన్ స్పందన చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని, వాళ్ళ మార్కెటింగ్, పబ్లిసిటిని స్టడీ చేసి దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఇప్పటి ప్రొడ్యూసర్లకు ఉందని హితవు పలికారు. ఆయన అన్నదాంట్లో కొంత మేర లాజిక్ ఉన్నప్పటికీ నిజానికి హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న విజయాల వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠాలు వేరే ఉన్నాయి.

ఇటీవలే లెనిన్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ఒడిస్సి రిలీజ్ డేట్ ఏడాది క్రితం ప్రకటించి మాట తప్పకుండా విడుదల చేశారని, మనం కనీసం రెండు వారాల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోలేకపోతున్నామని ఫీలయ్యారు. ఇది నిజంగా సీరియస్ ఇష్యూనే. స్పైడర్ మ్యాన్ కూడా అదే స్ట్రాటజీతో డెడ్ లైన్ మిస్ కాకుండా చూసుకుంది. ఇది మొదటి లెసన్. రెండోది మేకింగ్, విఎఫెక్స్ క్వాలిటీ విషయంలో మర్వెల్, డిస్నీ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ అద్భుత ఫలితాలు అందుకుంటున్నాయి.

కానీ మనమేం చేస్తున్నాం. ఆచార్యలో ఒక్క చిన్న సన్నివేశంలో చిరంజీవి డీ ఏజింగ్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాం. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బృందం గుంపుగా వెళ్లే గుర్రం సీన్ ఒకటి ట్రోలింగ్ కు గురైతే దాన్ని రెండో రోజే తీసేయాల్సి వచ్చింది. రాజా సాబ్ విఎఫ్ఎక్స్ ని మెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన అమ్మోరు, అంజి, అరుంధతి, దేవి గ్రాఫిక్స్ వీటికన్నా మెరుగ్గా ఉన్నాయంటే తప్పు ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాలా.

మనం ఇంప్రూవ్ కావాల్సింది ఇలాంటి విషయాల్లోనే. నిజానికి స్పైడర్ మ్యాన్ ఇండియాలో భీభత్సమైన పబ్లిసిటీ చేయలేదు. ఫ్రాంచైజ్ కున్న హైప్ వల్ల ఆటోమేటిక్ గా జనాలు ఎగబడ్డారు. ఎమోషన్ కాస్త ఎక్కువైనప్పటికీ ఒకసారి చూడాల్సిందేనని ఫిక్స్ అయిపోయి టికెట్లు కొనేస్తున్నారు. ఇప్పుడే కాదు ఇంకో మూడేళ్ళలో ఇంకో స్పైడర్ మ్యాన్ సినిమా వస్తే ఇంతకన్నా ఎక్కువే ఎగబడతారు. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ తాలూకు మేజిక్ అది. మనవాళ్ళూ దాన్ని అంది పుచ్చుకుంటే అద్భుతాలు జరుగుతాయి. 

This post was last modified on August 1, 2026 9:44 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago