Movie News

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ సినిమాలు చేసింది టాలీవుడ్లోనే. ఏడాది ముందు వ‌ర‌కు ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి పెద్ద చర్చ లేదు. ఆమె రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లుగా ఎప్పుడూ వార్త‌లు కూడా రాలేదు. కానీ బైస‌న్ సినిమా కోసం క‌లిసి ప‌ని చేసిన ధ్రువ్ విక్ర‌మ్‌తో అనుప‌మ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు ఆ సినిమా రిలీజ్ టైంలో వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం సాగిస్తున్న‌ట్లే అంతా భావించారు. 

కానీ ఈ మ‌ధ్య ఇద్ద‌రూ విడిపోయార‌ని తేలిపోయింది. రిలేష‌న్‌షిప్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక స్వేచ్ఛ‌గా ఉందనే అర్థం వ‌చ్చేలా అనుప‌మ వ‌రుస‌గా క్రిప్టిక్ పోస్టులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. రిలేష‌న్‌షిప్‌లో ఉన్న వాళ్ల‌ను బ్రేకప్ మొద‌ట బాధ పెట్టినా.. త‌ర్వాత సంతోషంగానే క‌నిపిస్తుంటారు. ఇప్పుడు అనుప‌మ కూడా ఆ స్థితిలోనే ఉన్న‌ట్లుంది.

త‌న కొత్త చిత్రం క్రేజీ క‌ళ్యాణం ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చి మీడియాను క‌లిసిన అనుప‌మ‌కు.. విలేక‌రుల నుంచి ఇటీవ‌లి క్రిప్టిక్ పోస్టుల గురించే ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఇటీవ‌ల‌ జీవితంలో చెడ్డ రోజుల గురించే మాట్లాడారు క‌దా, ఇప్పుడు మీరు ఓకేనా అని అడిగితే.. తాను చాలా బాగున్న‌ట్లు చెప్పిన అనుప‌మ, మీకేమ‌నిపిస్తోంది అంటూ ఎదురు ప్ర‌శ్నించింది. గ‌త ఏడాది కాలం అంత బాగా సాగ‌లేద‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని, ఇప్పుడు జీవితం ప‌ట్ల చాలా ఆశాజ‌న‌కంగా ఉన్నాన‌ని ఆమె చెప్పింది. 

ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్న‌ట్లు చెప్పిన అనుప‌మ‌.. క్రేజీ క‌ళ్యాణం సినిమా చేస్తున్న‌పుడు కూడా తాను ఇలాగే ఉండుంటే ఇంకా క్రేజీగా ఉండేద‌ని వ్యాఖ్యానించింది. మ‌రోవైపు ఇలా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం జ‌నాల‌కు అవ‌స‌ర‌మా అని అడిగితే.. త‌న సోష‌ల్ మీడియా త‌న ఇష్టం అని, త‌న‌కు ఏద‌నిపిస్తే అది చేస్తాన‌ని ఆమె తేల్చి చెప్పింది. మీరు రిలేష‌న్‌షిప్‌లో అవ‌త‌లి వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారా అని అడిగితే.. మీకు న‌న్ను చూస్తే ఏమ‌నిపిస్తోంది, నా జీవితం గురించి మీకేం తెలుసు అంటూ కొంచెం ఘాటుగానే స్పందించింది అనుప‌మ‌.

This post was last modified on August 1, 2026 11:41 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

1 hour ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago