దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం అయిన పేరు ఊర్మిళదే. ‘శివ’తో సంచలనం రేపాక ఊర్మిళను ప్రధాన పాత్రలో పెట్టి హిందీలో వర్మ తీసిన ‘రంగీలా’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఈ చిత్రంతో ఊర్మిళ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఒకరైపోయింది.
ఆ తర్వాత ఇద్దరూ పలు చిత్రాలకు కలిసి పని చేశారు. ఆ టైంలోనే ఊర్మిళతో వర్మ వ్యక్తిగత బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి. ఐతే ఆ బంధం జస్ట్ ఎఫైర్‌కు పరిమితం కాలేదని.. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని అంటున్నాడు బాలీవుడ్ వెటరన్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ బాంబు పేల్చాడు. ఈ విషయం తనకు మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు జ్యోతి వెంకటేష్ చెప్పడం కొసమెరుపు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ ఆలయంలో వర్మ, ఉర్మిళ ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారని.. ఈ సీక్రెట్ తనకు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారని జ్యోతి వెంకటేష్ తెలిపాడు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి తాను ఉర్మిళకు ఫోన్ చేసి అడగ్గా, ఆమె చాలా ఎమోషనల్ అయిందని, కానీ ఆమె ఈ పెళ్లి ఆరోపణలను మాత్రం ఖండించలేదని ఆయన చెప్పారు.
90వ దశకం చివర్లో రామ్ గోపాల్ వర్మ.. చిరంజీవి, ఊర్మిళ కాంబినేషన్లో ఒక సినిమాను మొదలుపెట్టి, కొన్ని రోజులు షూటింగ్ చేాశారు. కానీ అంతలోనే సంజయ్ దత్ జైలు నుంచి విడుదలై, అందుబాటులోకి రావడంతో.. చిరు చిత్రాన్ని ఆపేసి, తిరిగి బాలీవుడ్‌కు వెళ్లి ‘దౌడ్’ సినిమా తీశాడు. జ్యోతి వెంకటేష్ చెబుతున్న దాన్ని బట్టి చిరు సినిమాను డైరెక్ట్ చేస్తున్నపుడే.. ఊర్మిళను వర్మ పెళ్లి చేసుకుని ఉండాలి. ఈ సమాచారంలో ఎంత వరకు నిజం ఉందో కానీ.. ఊర్మిళ 2016లో మోసిన్ అక్తర్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. 2024లో ఈ జంట విడాకులు తీసుకుంది.
This post was last modified on August 1, 2026 4:14 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…