శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన పోటీలోనూ విజయం సాధించగా బైకర్ కమర్షియల్ గా ఆడకపోయినా నటన పరంగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇదే ఊపులో మూడో మూవీ కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అదే భోగి. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ వయొలెంట్ డ్రామా షూటింగ్ ముగింపుకు వచ్చింది. ఇంకొంత భాగమే పెండింగ్ ఉందని యూనిట్ సమాచారం.
దీనికి ముందు ప్రకటించిన విడుదల తేదీ ఆగస్ట్ 28. కానీ అనుకోకుండా టాక్సిక్ 26న వస్తుండటంతో క్లాష్ ఇబ్బందవుతుందని భావించి దర్శక నిర్మాతలు వేరే ఆప్షన్లు చూస్తున్నారట. కాకపోతే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా కీలకమైన వారాల్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. భోగికి పెట్టిన బడ్జెట్ దృష్ట్యా సోలో రిలీజ్ చూసుకోవడం ఉత్తమం. మరి సెప్టెంబర్ కు వెళ్తారా లేక అక్టోబర్ చూసుకుంటారా అనేది ఇంకా తేలలేదు. అసలు వాయిదా అనౌన్స్ మెంటే ఇంకా రాలేదు.
దీని సంగతలా ఉంచితే శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న ఎంటర్ టైనర్ 2027 సంక్రాంతికి రావాలని టీమ్ ముందుగానే ఫిక్స్ చేసుకుంది. పోటీ ఎంత ఎక్కువగా ఉన్నా వెనుకడుగు వేయకూడదని డిసైడ్ అయ్యారట. అలాంటప్పుడు భోగికి దీనికి మధ్య కనీసం గ్యాప్ ఉంటే బాగుంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. బైకర్ అలా తొందరపడటం వల్లే కొంత ఎఫెక్ట్ అయ్యిందనే వాళ్ళు లేకపోలేదు. డేట్ విషయంలో ప్లానింగ్ సరిగా లేదనేది కొందరి కామెంట్.
ఒకరకంగా చూసుకుంటే భోగినే సంక్రాంతికి వస్తే బెటరేమోననే ఆలోచన రాక మానదు. ఒకవేళ శ్రీను వైట్ల సినిమా కనక అనుకున్న టైంకి పూర్తి కాకపోతే ఇబ్బందే. ఎందుకంటే భోగి గెటప్ లోనే ఉన్న శర్వానంద్ అది పూర్తి చేసుకుని లుక్ మార్చేయాలి. చేతిలో ఉన్న కేవలం అయిదు నెలల టైంలో ఇంకో సినిమాని తీస్తారా అంటే ఏమో చెప్పలేం. ఒకప్పుడు ఈజీనే కానీ ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. మరి శర్వా మేకర్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on August 2, 2026 6:58 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…