వైసిపి చేసిన మావిగన్ ప్రతిపాదన వల్ల ప్రయోజనం ఏంటి అని మాజీ ఎంపీ, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉందనగా ఏపీ రాజధాని అంశంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరమేదికి తీసుకువచ్చారు. మావిగన్ అజెండాగా తాము వచ్చే ఎన్నికలకు వెళతామని తీర్చి చెప్పారు.
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడమే వైసీపీకి కావలసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.. వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మావిగన్ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ; కాదు మావిగన్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ; రెండు రాజకీయపార్టీలు చేస్తున్న భిన్న వాదనలు అర్థరహితమంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగింది. పన్నెండేళ్ళ తరవాత కూడా ఇంకా… రాజధాని ఎక్కడ ఉండాలన్న చర్చ నడుస్తోందంటే ఇది అందరూ సిగ్గు పడాల్సిన విషయం కాదా? అని విజయసాయి ప్రశ్నించారు. ఈ 12 ఏళ్లలో ఐదేళ్లు పరిపాలించిన వైసీపీ హయాంలో విజయసాయి ఎంపీగా ఉన్నారు. పార్టీలో కీలకమైన వ్యక్తిగా కూడా కొనసాగారు. ఆ టైంలో అమరావతిని వైయస్ జగన్ నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. రాజధాని పేరుమీద జరుగుతున్న ఈ పొలిటికల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఆపేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీదా ఉందని ఇప్పుడు చెబుతున్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు..?
అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలతో అవినీతిని సవాలు చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. ఇదే విజయ సాయి తన చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొత్తం మీద మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటనను ముందుకు తీసుకువెళ్లేందుకు, చర్చ జరిగేందుకు కొందరు నాయకులు తమ సహకారం అందిస్తున్నారని సమాచారం. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే అంశాన్ని మాత్రమే ప్రస్తావించకుండా, అమరావతి లో అవినీతి అంటూ జగన్ మాట్లాడిన మాటలనే ఈయన కూడా వల్లే వేస్తున్నారు. ఇదే అందుకు ఉదాహరణ.
This post was last modified on July 3, 2026 3:05 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…