Movie News

దసరా బరిలో క్రేజీ లైనప్

ఈ ఏడాది దసరా సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి కిక్కిచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మూడో వారం వరకు థియేటర్లలో పెద్ద సినిమాల హడావుడి కనిపించనుంది. డిఫరెంట్ జోనర్లలో వస్తున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఒకే సీజన్లో షెడ్యూల్ అయ్యే ఛాన్స్ ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సీజన్ మంచి కిక్ ఇవ్వనుంది.

ఈ లైనప్ లో నేచురల్ స్టార్ నాని ద పారడైజ్ తో ఓపెనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుందని నెట్టింట గట్టిగా వినిపిస్తున్నా మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సికింద్రాబాద్ స్లమ్స్ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని జాడల్ గా ఫుల్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. దసరా సెలవులు మొదలయ్యే టైమ్ కి థియేటర్లలోకి వస్తే సోలోగా మంచి కలెక్షన్స్ రాబట్టే స్కోప్ ఉంది.

ఆ తర్వాత అక్టోబర్ 2న విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం థియేటర్లలోకి రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి గాంధీ జయంతి లాంగ్ వీకెండ్ బాగా కలిసిరానుంది. పండగ టైమ్ లో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్లడం కామన్. సరిగ్గా అదే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తో వీళ్ళు బరిలోకి దిగుతున్నారు. వెంకీ మార్క్ హ్యూమర్, త్రివిక్రమ్ డైలాగ్స్ క్లిక్కయితే కలెక్షన్స్ మామూలుగా ఉండవు.

ఇక అక్టోబర్ సెకండ్ వీక్ లో బాక్సాఫీస్ హీట్ మరింత పెరగనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 అక్టోబర్ 15న వస్తుందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. దానికి ఒక్క రోజు గ్యాప్ లో అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతున్నా చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇదే జరిగితే లెజెండరీ హీరోల బాక్సాఫీస్ ఫైట్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది.

ఈ నాలుగు సినిమాలు ఒకదానికొకటి పూర్తిగా డిఫరెంట్ ఉండనున్నాయి. ఒక రా యాక్షన్ డ్రామా, ఒక క్లీన్ ఫ్యామిలీ స్టోరీ, ఒక మాస్ సీక్వెల్, ఒక విజువల్ సినిమా.. ఇలా అన్నీ ఒకే సీజన్ లో రావడం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. రిలీజ్ డేట్స్ మధ్య సరైన గ్యాప్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ పరంగా ఏ సినిమాకూ ఇబ్బంది ఉండకపోవచ్చు. మంచి రెస్పాన్స్ వస్తే ఈ ఫెస్టివల్ టైమ్ లో ఊహించని రేంజ్ లో వసూళ్లు రావడం గ్యారెంటీ.

This post was last modified on July 3, 2026 12:53 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago