Political News

వైసీపీ హయాంలో గ్రూప్ -1లో అక్రమాలు నిజమే

డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు నిరాధార ఆరోపణలు గగ్గోలు పెడుతున్న వైసీపీ అసలు గుట్టు బయట పడింది. గత ప్రభుత్వం పాలనలో నిర్వహించిన గ్రూప్ -1 లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం వేసిన సిట్ తుది నివేదికను హై కోర్టుకు సమర్పించింది. గ్రూప్ -1 మూల్యాంకనంలో నాటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు సిట్ నిర్ధారించింది. ఏపీపీ ఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా మూడు సార్లు మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదిక ఇచ్చింది.

సిట్ నివేదిక ప్రకారం… ఒకే జవాబు పత్రాలను మూడు సార్లు మూల్యాంకనం చేశారు. మూడో మూల్యాంకనం కోసం కొత్త ఓఎమ్మార్ బార్ కోడ్ షీట్లను 7 ముద్రించారు. ఎంపికైన 165మందిలో 160 మందికి సంబందించిన జవాబు పత్రాల్లో మార్కులలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ, రిట్ పిటీషనర్లకు సంబందించి 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగాయి. 61 మంది స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్లు తేలింది . స్వయంగా చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫారెన్సిక్ నివేదికలో బయట పడింది. జవాబు పత్రాలను హై ల్యాండ్ రిసార్ట్ లో 84 రోజులపాటు దాచి ఉంచడం అధికారులను విస్మయానికి గురిచేసింది.

ఎక్కడైనా పరీక్షా పత్రాలను నిపుణుల చేత మూల్యాంకనం చేయించడం జరుగుతుంది. వైసీపీ పాలకులు మాత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత మూల్యాంకనం చేయించారు. 452 మంది నిపుణుల ప్యానల్ ను పక్కన పెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది.

గ్రూప్ -1వంటి ప్రతిష్టాత్మక పరీక్షా పత్రాలను ఒక రిసార్ట్ లో ఎలా ఉంచుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత గ్రూప్ -1 జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేయించడం ఎంత బరితెగింపో అర్ధం చేసుకోవచ్చు. ఈ నివేదిక మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.

This post was last modified on August 12, 2026 5:36 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

2 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

2 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

3 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

4 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

5 hours ago