సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ నిన్నటి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. టిల్లు స్క్వేర్ తీసిన మల్లిక్ రామ్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కామెడీ డ్రామాని కొంచెం ఆలస్యంగా రిలీజ్ చేశారు. టీమ్ ప్రమోషన్లు బాగానే చేసింది. హీరో హీరోయిన్ తో పాటు టీమ్ లోని కీలక సభ్యులు పబ్లిసిటీలో భాగమై ఇంటర్వ్యూలిచ్చారు. అందుకే టాక్ మీద అందరికీ ఆసక్తి నెలకొంది.
పెద్దగా చదువులు లేని ఒక పల్లెటూరి జనాలకు సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాడనికి వెళ్లిన ఒక యువకుడి పాట్లే సూపర్ సుబ్బు స్టోరీ. మొత్తం ఏడు ఎపిసోడ్లతో ఒక్కొకటి నలభై నిమిషాలు సాగే నిడివితో లెన్త్ అయితే బాగానే సెట్ చేసుకున్నారు. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా బ్రహ్మానందం, మురళి శర్మ, గెటప్ శీను, జీవన్ లాంటి మెయిన్ ఆర్టిస్టులను తీసుకోవడంతో క్వాలిటీ పరంగా రాజీ పడిన దాఖలాలు ఉండవు. ప్రతి పాత్రను వినోదం కోసమే డిజైన్ చేసినట్టుగా ఉంటుంది.
టైటిల్, కాన్సెప్ట్ చూసి ఇదేదో పక్కా అడల్ట్ కంటెంట్ అనుకుంటారు కానీ అసభ్యత లేకుండా ఇంత సెన్సిటివ్ టాపిక్ ని ఎక్కువ బోర్ లేకుండా నడిపించడంలో మల్లిక్ రామ్ బాగానే సక్సెస్ అయ్యారు. వెబ్ సిరీస్ కాబట్టి ఎక్కువ నిడివి కోసం రాసుకున్న కొన్ని ఎపిసోడ్లు ల్యాగ్ అయిపోయి మధ్యలో కొంచం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ మైనస్ ని భరించగలిగితే టైం పాస్ లోటు ఉండదు. థియేటర్స్ లో లేని ఫార్వార్డ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇబ్బందేం లేదు
జనాలకు సూపర్ సుబ్బు ఇంకా పూర్తి స్థాయిలో రీచ్ అవ్వాల్సి ఉంది. గత కొంత కాలంగా వెబ్ సిరీస్ లకు ఆదరణ దగ్గిపోయింది. అన్ని ఓటిటిలు వ్యూస్ కోసం సర్కస్ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ ఎలాంటి స్పందన అందుకుంటాడో చూడాలి. విశేషం ఏంటంటే తనకు జూలై స్పెషల్ కానుంది. నెల ప్రారంభంలో సూపర్ సుబ్బు రిలీజ్ కాగా నెలాఖరులో తమిళనాడు సిఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా విడుదలవుతుంది. ఇందులో సందీప్ కిషనే హీరో.
This post was last modified on July 3, 2026 12:57 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…