అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు చేయాల్సిందే. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ తీరునే అవలంబిస్తున్నారు. మొన్నటిదాకా ఆమెలోని ఈ తీరు ఓ మోస్తరుగానే ఉన్నా…ఇటీవలి కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయిందని చెప్పాలి. తాజాగా ఇడుపు కాయితం పేరిట వస్తున్న ఓ సినిమాపై జరుగుతున్న వివాదం నేపథ్యంలోనూ ఆమె పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించి మరీ విమర్శలు గుప్పించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇడుపు కాయితం అంటే ఏమిటన్న విషయంపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. మన నోళ్లలో నిత్యం నానుతూ ఉన్న విడాకులనే ఇడుపు కాయితం అంటారన్న విషయం తెలిసిందే. ఇడుపు కాయితం అంటే ఏమిటన్నది చాలా మందికే తెలిసినా… ఈ పదం వినని ప్రస్తుత జెన్ జీ జనరేషన్… అదేమిటని ప్రశ్నించడంతో ఈ వివాదం రేగింది. తెలంగాణలో ఇప్పటికీ ఇడుపు కాయితం అనే పేరు బాగానే వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఓ జెన్ జీ… ఈ సినిమాను తెలుగులోకి అనువదిస్తారా? అంటూ వింత ప్రశ్న వేసి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి బీజం వేశారు.
ఈ వివాదం సినీ జనాల వరకే పరిమితం అవుతుందని భావించినా… ఆ పరిధిని అది దాటేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజిలో దీనిపై రచ్చ సాగుతోంది. తాజాగా ఆదివారం ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా కవిత కూడా ఈ వివాదాన్ని ప్రశ్నించారు. ఇడుపు కాయితం అనే పదం తెలంగాణకు చెందిన పదమని చెప్పిన కవిత.. ఈ పదం అర్థం కూడా తెలియదని చెబుతున్న వైనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెను వివాదంగా మారే ప్రమాదం లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ యాసను ఓ సారి అవహేళన చేసినందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని ఆమె అన్నారు. తెలంగాణ భాషను ఇంకోసారి అలాంటి వెకిలి ప్రయత్నం చేయొద్దండి అని ఆమె అన్నారు.
అంతటితో ఆగని కవిత… ఏమాత్రం సంబంధం లేని పవన్ కల్యాణ్ ను ఈ వివాదంలోకి లాగారు. ఇడుపు కాయితం అంటే ఏమిటో తెలియని వారు సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి అడగాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇడుపు కాయితం అంటే పవన్ కల్యాణ్ కు బాగా తెలుసునని… ఆయన తప్పనిసరిగా ఆ పదానికి అర్ధం చెబుతారని కూడా కవిత పేర్కొన్నారు.
జనసేనను పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలోనే పవన్ తన పార్టీని ప్రకటించారు. ఆ సందర్భంగానూ కవిత… పవన్ హైదరాబాద్ లో పార్టి పెట్టుడేందీ? పోయి మీ రాష్ట్రంలో పెట్టుకోండి అంటూ సంచలన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా పవన్ పై ఆమె విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఇడుపు కాయితం వివాదంలోనూ పవన్ ప్రమేయం ఏమీ లేకున్నా కూడా కవిత ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం గమనార్హం.
This post was last modified on June 28, 2026 6:08 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…