Movie News

ఘట్టమనేని వారసుడి వెనుకడుగు ఎందుకంటే

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్ ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ప్రమోషన్లు ఆగిపోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్స్ రాకపావడంతో అభిమానుల్లో అనుమానం మొదలయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడింది. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ థియేటర్ రిలీజుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాని ఒకవేళ నిజమైతే మటుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే జూలై 10 లెనిన్ వస్తోంది. అన్నపూర్ణ, సితార సంస్థలు చాలా ప్రెస్టీజియస్ గా దీన్ని రిలీజ్ చేస్తున్నాయి. ట్రయిలర్ వచ్చాక అంచనాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని అంటున్నారు. దీనికి వారం ముందు జూలై 3న రావు బహదూర్, నాగబంధం వస్తున్నాయి. కంటెంట్ పరంగా రెండూ మంచి హైప్ పెంచుకుంటున్నాయి. వీటి మధ్య జయకృష్ణ పోరాడాల్సి ఉంటుంది.

దానికి తోడు కేవలం పది రోజుల వ్యవధిలో ఈవెంట్లు చేసి, బజ్ పెంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. పైగా ఈవెంట్ కు వచ్చేందుకు మహేష్ బాబు కూడా అందుబాటులో లేరని టాక్. ఇంత పోటీ మధ్య ఇబ్బంది పడటం కంటే సేఫ్ గా మరోసారి రావడం మంచిదేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే శ్రీనివాస మంగాపురం మీద ఏమంత సౌండ్ లేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కొంచెం లేట్ అవ్వడం ఒకరకంగా సేఫ్ గేమని చెప్పాలి.

పైగా కొత్త హీరో హీరోయిన్, స్టార్ డైరెక్టర్ లేకపోవడం లాంటి అంశాలు మార్కెట్ పరంగా కొంత ప్రభావం చూపిస్తున్నాయి. మంగళవారం సక్సెస్ అయ్యింది కానీ మరీ పెద్ద స్థాయిలో కాదు. అందుకే అజయ్ భూపతి బ్రాండ్ కొంతమేర పని చేస్తోంది. మోహన్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ లవ్ డ్రామా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. లవ్ స్టోరీ అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా జాగ్రత్త వహించారట. జివి ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం సమకూర్చారు.

This post was last modified on June 28, 2026 3:59 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago