Movie News

విశ్వనాథ్ వసూళ్లకు కుటుంబాలే కీలకం

ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా అయినా, తీసింది తెలుగు నిర్మాత, దర్శకుడు కాబట్టి నేటివిటీతో సంబంధం లేకుండా టాలీవుడ్ లోనూ మంచి బజ్ వస్తోంది. అందులోనూ వీరభద్రుడు హిట్ ప్రభావం సానుకూలంగా పని చేసేలా ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా సూర్యకు మన దగ్గర చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. హైదరాబాద్ లో ఈవెంట్లు చేసినప్పుడు వచ్చే అభిమాన సందోహంలో గమనించవచ్చు.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంటోంది. సూర్య చెప్పినట్టు ఇందులో దర్శకుడు వెంకీ అట్లూరి మూడు శక్తివంతమైన మహిళా పాత్రలను తీర్చిదిద్దారు. అవి మమిత బైజు, రాధికా శరత్ కుమార్, రవీనాటాండన్ పోషించినవి. పైకి పేర్లు ఆయన చెప్పలేదు కానీ స్టోరీ ప్రకారం చూసుకుంటే స్కోప్ ఉన్నది వీళ్ళకే. రైఫిల్ షూటింగ్ గేమ్ లో నిపుణుడైన విశ్వనాథ్ జీవితంలో వీళ్ళు ఏమేం చేశారనేది చాలా కీలకం కానుంది.  

అలా అని మాస్ ని వెంకీ అట్లూరి లైట్ తీసుకోలేదు. ఒక స్పెషల్ సాంగ్ తో పాటు ఫైట్లు కూడా పెట్టారు. ట్రైలర్ లో చూచాయగా శాంపిల్స్ చూపించారు. అయితే అవి పరిమితంగా మాత్రమే. నిర్మాత నాగవంశీ అన్నట్టు అల వైకుంఠపురములో, సూర్య సన్నాఫ్ కృష్ణన్, అత్తారింటికి దారేది షేడ్స్ లో కనక ఈ సినిమా ఉంటే తమిళ ప్రేక్షకుల కన్నా మనకే ఎక్కువ నచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే డిసికి తమిళనాడులో కంటే ఏపీ తెలంగాణలో ఎక్కువ కలెక్షన్లు రావడం చూశాం.

డిసి యాక్షన్ మూవీ కాబట్టి దాంతో పోలిక సరికాదు కానీ కంటెంట్ బాగుంటే మనోళ్లు స్ట్రెయిట్, డబ్బింగ్ అనే తేడాలు పట్టించుకోరనేది చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు సార్ స్థాయిలో రిజిస్టర్ కాలేదని మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు కానీ సినిమా చూశాక సాంగ్స్ బాగా రీచ్ అవుతాయని టీమ్ నమ్మకంగా ఉంది. ఎమోషన్స్ కనక సరిగ్గా వర్కౌటయ్యి, సూర్య మమిత కెమిస్టీ కనక కనెక్ట్ అయితే విశ్వనాథ్ కు మంచి స్వాగతమే లభిస్తుంది.  

This post was last modified on August 12, 2026 5:26 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago