Movie News

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ని టార్గెట్ చేసుకుని సూపర్ హిట్స్ సాధించడం ఆయన శైలి. అందుకే హ్యాపీ డేస్, గోదావరి, ఆనంద్ లాంటివి మాస్ కి చేరకపోయినా బాక్సాఫీస్ వసూళ్లు సాధించాయి. గత ఏడాది కుబేర రూపంలో నాగార్జున, ధనుష్ అరుదైన కాంబినేషన్ సెట్ చేసుకుని విజయం సాధించిన కమ్ముల తమిళంలో మాత్రం సక్సెస్ చూడలేకపోయారు.

ఇదిలా ఉండగా కుబేర వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా శేఖర్ కమ్ముల కొత్త మూవీ అనౌన్స్ మెంట్ రాలేదు. ఏషియన్ సంస్థ ఈయనతో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. గతంలో నాగచైతన్యతో లవ్ స్టోరీ తీసి సక్సెస్ అందుకున్న కమ్ముల మరోసారి కాంబో సెట్ చేయొచ్చనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. అయితే వృషకర్మతో ప్యాన్ ఇండియా లీగ్ ట్రై చేస్తున్న చైతుకి ముందు స్టోరీ నచ్చాలి.

నాని కోసం కూడా శేఖర్ కమ్ముల ట్రై చేస్తున్నారనే టాక్ ఉంది కానీ ఎలాంటి ధృవీకరణ లేదు. శేఖర్ కమ్ములకున్న ప్రధాన సమస్య ఏమిటంటే ఇప్పుడు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు హీరోలు వరల్డ్ బిల్డింగ్., ఫాంటసీ అంటూ పెద్ద బడ్జెట్లు డిమాండ్ చేసే కథలను ఎంచుకుంటున్నారు. చిరంజీవి విశ్వంభర నుంచి కిరణ్ అబ్బవరం ఇంద్రపుత్ర వరకు అందరూ ఇదే దారిలో ఉన్నారు. శర్వానంద్, సాయి దుర్గ తేజ్, నిఖిల్ సిద్దార్థ వగైరాలదీ ఇదే వరస.

సిచువేషన్ ఇంత టైట్ గా ఉన్నప్పుడు శేఖర్ కమ్ములకు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది పెద్ద ప్రశ్న. అంత సులభంగా ఈ సస్పెన్స్ తీరేలా లేదు. పైకి గొప్పలు చెప్పుకోరు కానీ శేఖర్ కమ్ముల కెరీర్ మొత్తంలో ఇప్పటిదాకా ఒకే డిజాస్టర్ ఉంది. అది కూడా హిందీ రీమేక్ అనామిక. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్లాప్ అయినా నెగటివ్ కామెంట్స్ రాలేదు. డాలర్ డ్రీమ్స్ నుంచి కుబేర దాకా మిగిలినవాటికి నిర్మాతలెవరూ నష్టపోలేదు. అయినా సరే ఇంత గ్యాప్ వస్తోంది. రావడం కాదు కమ్ముల గ్యాప్ తీసుకుంటున్నారు. 

This post was last modified on August 12, 2026 5:02 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago