పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ లెక్కలో ఏ మాత్రం పొరపాటు చేసినా కలెక్షన్ల మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఐ యాం గేమ్ మీద మల్లువుడ్ లో భారీ అంచనాలున్నాయి. జానర్ ఇతర భాషల్లోనూ మంచి బజ్ తీసుకొస్తుందని నిర్మాతలు భావిస్తూ వచ్చారు. ఆగస్ట్ 20 రిలీజ్ డేట్ ఎప్పుడో రెండు నెలల కింద అధికారికంగా ప్రకటించుకున్నారు.
అయితే ఇప్పుడీ ఐ యాం గేమ్ రావడం లేదని కేరళ మీడియా టాక్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ రెండు మూడు రోజుల నుంచి ప్రమోషన్లను పూర్తిగా ఆపేయడంతో మ్యాటర్ ఏంటో జనాలకు అర్థమైపోయింది. ఒకరకంగా చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ చాలా తెలివిగా తప్పుకున్నాడు. ఎందుకో చూద్దాం. ముందుగా తమిళం వైపు చూస్తే ఆగస్ట్ 14 ఒకే రోజు విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం వస్తున్నాయి. కోలీవుడ్ బయ్యర్ల మద్దతు వీటికి పుష్కలంగా ఉండి రెండు వారాలు అగ్రిమెంట్ చేసుకుంటున్నాయట.
తెలుగు వైపు చూస్తే ఆగస్ట్ 21 రవితేజ ఇరుముడి ఉంది. దీని మీదా మంచి బజ్ నెలకొంది. ఇవన్నీ పక్కనపెడితే ఆగస్ట్ 26 యష్ ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్ దిగుతుంది. రాష్ట్రంతో సంబంధం లేకుండా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసింది కెవిఎన్ ప్రొడక్షన్స్. ఐ యాం గేమ్ ముందు వెనుకా ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంటే నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. ఇవి చాలవన్నట్టు ఆగస్ట్ 20 పృథ్విరాజ్ సుకుమారన్ ఖలీఫా వస్తోంది. మన దగ్గర హైప్ లేదు కానీ ఒరిజినల్ వెర్షన్ కు బాగానే బిజినెస్ జరిగింది.
ఇవన్నీ లెక్కలోకి తీసుకుని ఐ యాం గేమ్ ని వాయిదా వేసుకోవడం మంచి నిర్ణయమే. అయితే కొత్త డేట్ ఏంటనేది ఇంకా లాక్ చేసుకోలేదు. దుల్కర్ సల్మాన్ కు ఇంకో సమస్య లేకపోలేదు. తన మరో రెండు సినిమాలు ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ రెండూ షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి. వీటిలో ఒకటి అక్టోబర్ లో వస్తుంది. సో ఐ యాం గేమ్ సెప్టెంబర్ నే ఎంచుకోవాల్సి ఉంటుంది. అది కూడా చివరి వారం నాని ప్యారడైజ్ తో క్లాష్ రాకుండా చూసుకుంటే బెటర్.
This post was last modified on August 12, 2026 5:00 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…