Political News

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. నల్లజెండాలతో గో బ్యాక్ మావిగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లు, కోడిగుడ్లతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అయితే, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసు కానిస్టేబుల్‌ ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలో హై టెన్షన్ వాతావరణం ఉండడంతో అక్కడ భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? అని ఏపీ సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆహ్వానం ప్రకారం సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో ఉండవల్లిలో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? అని నిలదీశారు.

ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్‌ చేశారని జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? అని జగన్ ప్రశ్నించారు. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారని, పచ్చ ముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. అయినా సరే, రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదని, వారి పక్షాన వైసీపీ నిలబడుతుందని చెప్పారు.

This post was last modified on June 27, 2026 8:32 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago