Movie News

ఫౌజీ రాకకు ముహూర్తం ఫిక్స్ ?

ప్రభాస్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సినిమా స్పిరిట్ కావొచ్చు కానీ దానికన్నా ముందే రాబోతున్న ఫౌజీని తక్కువంచనా వేయడానికి లేదు. గత ఏడాది ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత టీమ్ సైలెంట్ అయిపోవడంతో ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. మధ్యలో హఠాత్తుగా కల్కి 2 మొదలైపోవడం చూసి ఏం జరుగుతుందో అర్థం కాక అప్డేట్స్ కోసం ఎదురు చూశారు. ఇప్పటికీ అఫీషియల్ గా రాలేదు కానీ ఫౌజీ విడుదల తేదీ లాకైనట్టు ఇన్ సైడ్ టాక్.

విశ్వసనీయ సమాచారం మేరకు ఫౌజీ డిసెంబర్ 3 థియేటర్లలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇది ఎంత మంచి డేటో చెప్పనవసరం లేదు. అఖండ, పుష్ప 2, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు ఈ వారంలోనే వచ్చి వసూళ్ల వర్షం కురిపించాయి. క్రిస్మస్ దాకా బాక్సాఫీస్ ని ర్యాంపేజ్ ఆడించాయి. అందుకే ఫౌజీని ఇదే స్లాట్ లో దింపాలనేది మైత్రి మూవీ మేకర్స్ ఆలోచన. త్వరలోనే ప్రకటించే అవకాశం లేకపోలేదు. కాకపోతే ఒక కొన్ని డౌట్లు లేకపోలేదు.

మార్చిలో రావాలని స్పిరిట్ ఎప్పుడో లాక్ చేసుకుంది. కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ రాలేదు. బాహుబలి ముందు కూడా లేవు. బిజినెస్ యాంగిల్ లో చూసుకుంటే ఇది కొంచెం రిస్క్ తో కూడిన వ్యవహారమే. ఎందుకంటే డార్లింగ్ నుంచి తర్వాత చాలా పెద్ద గ్యాప్ వస్తుంది. 2028 కన్నా ముందు కల్కి 2 వచ్చే ఛాన్స్ లేదు. సలార్ 2 మొదలయ్యే దాకా నమ్మలేం. ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టయిల్ తెలిసిందే. ఏళ్లకేళ్లు గడిచిపోతాయి.

అలాంటప్పుడు రెండు సినిమాల నిర్మాతలు దీనికి సిద్ధపడతారా అనేది వేచి చూడాలి. అయినా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన దానికి కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ ఇప్పుడు టాలీవుడ్ లో లేదు. డ్రాగన్ నుంచి ప్యారడైజ్ దాకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే అవుతుంది. మరి ఫౌజీ మాటకు కట్టుబడుతుందో లేదో చూడాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్ కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

This post was last modified on June 27, 2026 7:36 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago