Movie News

డ్రాగన్ అలా చేస్తే అభిమానులకు పండగే

డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్ బస్టర అయ్యుంటే ఈ ఫీలింగ్ తగ్గి ఉండేదేమో కానీ దేవర తర్వాత అలాంటి డిజాస్టర్ రావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. కాకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి వాళ్ళ ఎదురు చూపులకు తగిన న్యాయం జరుగుతుందనే నమ్మకం మూవీ లవర్స్ లోనూ ఉంది. డ్రాగన్ రిలీజ్ వచ్చే ఏడాది జూన్ 11 ఫిక్సయిన సంగతి తెలిసిందే.

ఇది మొదటి భాగమేనని, పార్ట్ 2 అదే సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. అంటే కేవలం ఆరు నెలల గ్యాప్ లో రెండు తారక్ సినిమాలు వచ్చేస్తాయి. అది కూడా సీక్వెల్ రూపంలో. నిజంగా ఇలా జరిగితే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఒకప్పుడు అయితే ఇలా చేయడం రిస్క్ అనుకునేవాళ్లు. ఎందుకంటే బాహుబలి, పుష్ప, కెజిఎఫ్, కాంతార సీక్వెల్స్ మధ్య కనిష్టంగా రెండు మూడు సంవత్సరాల గ్యాప్ ఉంది.

కానీ ఈ లెక్కలను దురంధర్ మార్చేసింది. నిన్న ఏడాది డిసెంబర్ లో ఫస్ట్ పార్ట్ వస్తే మార్చిలో ది రివెంజ్ దింపేశారు. కట్ చేస్తే రెండు కలిసి మూడున్నర వేల కోట్లు వసూలు చేసి, దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. ఒకేసారి రెండు భాగాలు షూటింగ్ చేసుకోవడం వలన కలిగే లాభాలను దర్శకుడు ఆదిత్య ధార్ కలెక్షన్ల సాక్షిగా నిరూపించాడు. ఇప్పుడు డ్రాగన్ కూడా అదే పాటిస్తోంది కాబోలు. యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇంటర్నల్ టాక్ అయితే ఓ రేంజ్ లో ఉంది.

సో ఇది అఫీషియల్ గా టీమ్ నుంచి బయటికి వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం కానీ డ్రాగన్ గురించి వినిపిస్తున్న వార్తలు మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా తారక్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడనే టాక్ ముందు నుంచీ ఉంది. అది అన్నదమ్ముల రూపంలోనా లేక తండ్రి కొడుకులుగానా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సలార్ తర్వాత మళ్ళీ తన ముద్ర చూపించలేకపోయిన సంగీత దర్శకుడు రవి బస్రూర్ కు సైతం ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం.

This post was last modified on June 27, 2026 7:39 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago