Political News

ఇలాగైతే వైసీపీని దేవుడు కూడా కాపాడలేడు

ఓ పరామర్శ అయినా, ఓ సాయం అయినా, ఓ ఓదార్పు అయినా, ఓ కేసు అయినా, ఓ పథకం అయినా… తాము కాకుండా మరెవ్వరూ చేయరాదన్న రీతిలో వైసీపీ నేతలు ఓ రేంజిలో ఫైరైపోతున్నారు. ఒక్కో పార్టీకి ఒక్కో ఐడియాలజీ ఉంటుందన్న కామన్ సూత్రాన్నీ వారు మరుస్తున్నారు. తమ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నీ చేయగలరని… ఆయనలా మరొకరు ఏ పనీ చేయలేరని వారు చెబుతున్న తీరు నిజంగానే జనాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. వెరసి తాము కొనసాగుతున్న వైసీపీని వారు మరింతగా దిగజారుస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క రాజకీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో వంద శాతం ఫలితాలను సాదించిన జనసేన… ఏపీలో అదికార కూటమిలో కీలక బాగస్వామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వేస్తున్న ప్రతి అడుగూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందే తెలుగు నేల వ్యాప్తంగా అశేష జనాభిమానాన్ని చూరగొన్న పవన్… తన అభిమానుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందిస్తున్నారు. అందులో బాగంగానే ఆయన బుధవారం తెలంగాణకు చెందిన తన అభిమాని నిరంజన్ ను కలిసేందుకు హన్మకొండ అక్కడి దాకా వెళ్లారు.

పవన్ హన్మకొండ పర్యటన ఇంకా పూర్తిగా ముగియకముందే వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మీడియా ముందు ప్రత్యక్షమైపోయారు. పవన్ తెలంగాణ టూర్ ను ఫుల్ గా ఫాలో అయ్యారో, ఏమో తెలియదు గానీ…పవన్ పర్యటనపై నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎవడో అనారోగ్యంతో ఉన్నాను అనగానే పవన్ పరుగులు పెట్టి అక్కడికెళ్లిపోయారని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ కు హన్మకొండలో జనం నీరాజనం పలకడంతో నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఉన్న సమస్యలను పట్టించుకోని పవన్… అక్కడెక్కడో తెలంగాణలో అన్నా నాకు బాగా లేదనగానే పరుగులు పెట్టారని నాని ఓ వింత వ్యాఖ్య చేశారు. ఏపీలో తన సొంత పార్టీ జనసేనకు చెందిన శ్రేణులకు నష్టం జరిగినా పవన్ స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. తన కుమారుడిని పోలీసులే చంపేశారని ఓ తల్లి మొరపెట్టుకుంటున్నా… ఆ దిశగా చూడని పవన్ తెలంగాణ అభిమాని వద్దకు పరుగులు పెట్టారని ఆరోపించారు.

తన ఇల్లును కూల్చేశారని ఓ జన సైనికుడు ఆవేదన వ్యక్తం చేసినా పవన్ స్పందిచడం లేదన్నారు. తక టీడీపీ నేతలు తనపై దౌర్జన్యం చేస్తున్నారని జన సైనికుడు ఫిర్యాదు చేసినా పవన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆరోపించారు. ఈ తరహా వ్యాఖ్యలతో వైసీపీపై ఇప్పటికే జనంలో ఉన్న వ్యతిరేకతను మరింతగా పెంచేస్తూ నాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on June 17, 2026 9:35 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago