Movie News

ఇండియాపై నోలన్ ప్రేమ చూశారా?

ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో సందేహం లేదు. ‘మొమెంటో’ మొదలుకుని.. ‘ఆపెన్ హైమర్’ వరకు అతను తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండమే. సినిమా సినిమాకూ ఇంతింతై అని ఎదిగిపోతూ.. వరల్డ్ వైడ్ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారాయన.

నోలన్‌ సినిమాలను గొప్పగా సెలబ్రేట్ చేసే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. మూడేళ్ల ముందు ‘ఆపెన్ హైమర్’ రిలీజైనపుడు మన దేశంలో ఎంత హంగామా నెలకొందో తెలిసిందే. ఆ సినిమా నోలన్ ముందు చిత్రాల స్థాయిలో థ్రిల్లింగ్‌గా లేకపోయినా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని తర్వాత నోలన్ రూపొందించిన ‘ది ఒడిస్సీ’కి హైప్ మామూలుగా లేదు. వచ్చే నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈసారి తనదైన శైలిలో సైన్స్ ఫిక్షన్ జోడించి వార్ నేపథ్యమున్న కథతో నోలన్ వస్తుండడంతో ‘ది ఒడిస్సీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్న ఈ సినిమాకు ముందే వరల్డ్ వైడ్ కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ప్రిమియర్స్ వేయబోతున్నారు. అందులో మన ముంబయి కూడా ఉండడం విశేషం. న్యూయార్క్‌, పారిస్, లండన్‌లతో పాటుగా ముంబయిని ప్రిమియర్స్ కోసం నోలన్ ఎంచుకోవడంతో ఆయన ఇండియాకు ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

స్వయంగా నోలన్ ఈ ప్రిమియర్‌కు హాజరయ్యే అవకాశముంది. నోలన్ సినిమాలకు మొత్తంగా జరిగే బిజినెస్‌తో పోల్చి చూస్తే… ఇండియాలో వచ్చేది కొంతే. కానీ ఇక్కడి సినీ ప్రియులు తన మీద చూపించే ప్రేమను అర్థం చేసుకోవడం, ఇంకా ఇక్కడ మార్కెట్‌ను విస్తరించే అవకాశం ఉందని నమ్మడం.. ప్రిమియర్‌ కోసం ముంబయిని నోలన్ ఎంచుకోవడానికి కారణం కావచ్చు. ఇది ఇండియాకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.

This post was last modified on June 17, 2026 6:16 pm

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

2 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

3 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

6 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

9 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

9 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

11 hours ago