Political News

అమెరికా గ‌ట్టి స‌వాల్… ఇప్పుడైనా మోడీ నోరువిప్పేనా?

అమెరికానుంచి త‌ర‌చుగా భార‌త్‌కు అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. వ‌ల‌స విధానానికి సంబంధించి, హెచ్‌-1బీ వీసాల‌కు సంబంధించి కూడా భార‌త్‌కు అమెరికా నుంచి స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ఇక‌, ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలోనూ.. సుంకాల విష‌యంలో ట్రంప్ మొండివాద‌న వినిపిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. భార‌త్ ఎక్క‌డా అమెరికాకు స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతోంది. ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ ప‌న్నెత్తు మాట కూడా అనలేక పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా.. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిని.. శ‌త్రు దేశాల‌తో చేతులు క‌లిపారంటూ బీజేపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు.

వాస్త‌వానికి అమెరికా అధ్య‌క్షుడుగా తొలిసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు వేరుగా ఉంది. ప్ర‌ధాని మోడీతో ఆయ‌న క‌లిసి క‌లివిడిగా మెలిగారు. కానీ, రెండో సారి అమెరికా అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత‌.. ట్రంప్ నిర్ణ‌యాలు భారత్‌కు ప‌లు స‌వాళ్ల‌ను రువ్వుతున్నాయి. ఇది భార‌త దేశానికే ఇబ్బందిగా మారుతోంద‌ని రాహుల్‌గాంధీ వంటి వారు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా-భార‌త్ మ‌ధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కూడా.. తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింద‌న్నారు. రైతుల‌కు స్వేచ్ఛ‌లేకుండా పోతుంద‌ని కూడా ఆరోపించారు.

తాజాగా మ‌రింత‌..!

భార‌త్ విష‌యంలో అమెరికా తాజాగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఏకంగా భార‌త సార్వ‌భౌమాధికారాన్నే ప్ర‌శ్నించేలా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. రెండు రూపాల్లో అమెరికా వ్య‌వ‌హ‌రించిన తీరు.. భార‌త్‌ను మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టింది. దీని వ‌ల్ల దాయాది దేశం పాకిస్తాన్‌కు మ‌రింత‌గా మ‌నం చుల‌క‌న అవుతున్నామ‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. క‌నీసం ఈ విష‌యంలో అయినా.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స్పందిస్తారా? లేదా? అంటూ.. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ స్పందించ‌లేదు.

ఏంటా రెండు అంశాలు?

1) అమెరికా ప‌శ్చిమ తీరం నుంచి భార‌త్ ప‌శ్చిమ తీరం వ‌ర‌కు ఉన్న‌స‌ముద్ర ప్రాంతాన్ని.. `యూఎస్‌-ఇండో ప‌సిఫిక్‌ తీరంగా పేర్కొంటూ.. 8 సంవ‌త్స‌రాల కిందట పేరు పెట్టారు. త‌ద్వారా.. ఈ తీరాన్ని భార‌త్‌-అమెరికా సంయుక్తంగా ర‌క్షించుకునేందుకు, వినియోగించుకునేందుకు కూడా అవ‌కాశం ల‌భించింది. అయితే.. తాజాగా యూఎస్‌-ఇండోప‌సిఫిక్‌ పేరును యూస్ ప‌సిఫిక్ పేరుగా మార్చేశారు. అంటే.. భార‌త్ పేరును తీసేశారు. పోనీ.. ఇదేమ‌న్నా భార‌త్‌కు చెప్పి చేశారా? అంటే.. అది కూడా లేదు. ఇది ఏక‌ప‌క్ష నిర్ణ‌యం. పైగా అమెరికా దీనిని స‌మ‌ర్థించుకుంది.

2) భార‌త మ్యాప్‌లో ఉన్న పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను పూర్తిగా తొల‌గించేశారు. దీనిని పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ.. మ్యాప్‌లో అమెరికా సంపూర్ణ మ్యాపులు చేసింది. అంతేకాదు.. దీనినే అధికారికంగా తాము గుర్తిస్తున్నామ‌ని కూడా ప్ర‌క‌టించింది. ఇది పూర్తిగా భారత సార్వ‌భౌమ అధికారంలోకి అమెరికా చొచ్చుకురావ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. భార‌త మ్యాప్‌లో పీఓకే కూడా క‌లిసి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అమెరికా.. దీనిని పూర్తిగా పాకిస్థాన్ భూభాగంగా పేర్కొన‌డం తీవ్ర వివాదానికి దారితీసింది. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌ధాని స్పందిస్తారో లేదో చూడాలి. చిత్రం ఏంటంటే.. ఫ్రాన్స్‌లో ప్ర‌ధాని మోడీ.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భేటీ కానున్న గంటకు ముందు ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

This post was last modified on June 17, 2026 6:51 pm

Share

Recent Posts

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

15 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

41 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 hour ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

1 hour ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago