Political News

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. దీంతో త‌ర‌చుగా ఆయన ప‌నితీరు.. విధానం వంటివాటిపై స‌మాజంలో చ‌ర్చ సాగుతూనే ఉంది. రాజ‌కీయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఓ ఉప ముఖ్య‌మంత్రిగా, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఆయ‌న ప‌నితీరుపై ప్ర‌జ‌లు నిశితంగానే గ‌మ‌నిస్తార‌ని అంటున్నారు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న శాఖ‌ల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు.

పంచాయ‌తీలు: పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న ప‌వ‌న్ తాను ఈ బాధ్య‌త‌లు చేప‌ట్టాక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. కేంద్రం నుంచి పంచాయ‌తీల‌కు వ‌చ్చే నిధుల‌ను నేరుగా వాటికే చేరేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వ వాటాను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఇచ్చేలా సీఎం ను ఒప్పించారు. ఫ‌లితంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయ‌తీల‌కు నిధుల కొర‌త లేకుండా పోయింది. అంతేకాదు.. కేంద్రం అమ‌లు చేస్తున్న జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌, గ్రామీణ స‌డ‌క్‌యోజ‌న వంటివాటిని అందిపుచ్చుకుని.. పంచాయ‌తీల‌ను మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవ‌ల ఐదు అవార్డులు రావ‌డం.. పవ‌న్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం.

అడ‌వులు: అట‌వీ శాఖ మంత్రిగా కూడా.. ప‌వన్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. రెండేళ్ల‌లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అట‌వీ ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో స‌మాజంలో చ‌ర్చించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. సామూహిక మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంతోపాటు.. స‌ముద్ర‌తీరాల‌ను ప‌చ్చ‌ద‌నంతో నింపే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేసే దిశ‌గా అడుగులు వేశారు. అదేవిధంగా ఏనుగుల గుంపుల ద్వారా జ‌రుగుతున్న న‌ష్టాన్ని నివారించేందుకు క‌ర్ణాట‌క నుంచి కుంకీ ఏనుగులు తీసుకువ‌చ్చారు. అలానే.. జంతువుల దాడుల కార‌ణంగా మృతి చెందే వారి కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప‌రిహారాన్ని డ‌బుల్ చేశారు. ఇవ‌న్నీమేలైన ఫ‌లితాలు ఇస్తున్నాయి.

ఉప‌ముఖ్య‌మంత్రిగా: ఇక‌, పూర్తిస్థాయిలో ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పైనే కాకుండా.. అన్ని శాఖ‌ల‌పైనా మాట్లాడేందుకు.. చ‌ర్య‌లు తీసుకునేందుకు, ఆదేశించేందుకు కూడా అవ‌కాశం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఇది క‌నిపిస్తోంది. కానీ, ప‌వ‌న్ ఎప్పుడూ హ‌ద్దులు మీర‌లేదు. ఒకే ఒక్క‌సారి హోం శాఖ విష‌యంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది కూడా.. రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టేన‌ని చెప్పాలి. అంటే.. ఒక ర‌కంగా.. త‌న హ‌ద్దులు ఎప్పుడూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ దాట‌లేదు. దీంతో ఉప‌ముఖ్య‌మంత్రి కూడా ఆయ‌న మంచి మార్కులే వేయించుకున్నారు.

రెండేళ్ల‌లో అచ్చంగా ప‌వ‌న్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఇవీ..

1) ప‌ల్లె పండుగ‌: 4,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లు, వ్యవసాయ చెరువులు, పశువుల షెల్టర్ల నిర్మాణాన్ని సులభతరం చేసిన ఒక ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాల కార్యక్రమం.

2) అడ‌విత‌ల్లి బాట‌: రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గ్రామాలను అనుసంధానించడం, అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ప‌థ‌కం. దీనికి 1,005 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌ణాళిక చేశారు.

3) మ‌న ఊరు-మాటా మంతీ: గ్రామ సమస్యలను నేరుగా పరిష్కరించడానికి, స్థానిక పౌర సౌకర్యాలను అమలు చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకునే భాగస్వామ్య పాలన కార్యక్రమం.

4) ‘అమరజీవి జలధార’: 2027 నాటికి 1.21 కోట్ల మందికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు రూపొందించిన ప‌థ‌కం. రూ. 7,910 కోట్ల విలువైన రాష్ట్ర స్థాయి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్.

5) ప్రాజెక్ట్ హనుమాన్ : వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ, చికిత్స , పోషణ కోసం చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మం.

6) సీడ్ బాల్స్ డ్రైవ్‌: విత్తన గుళికల సేకరణ కార్యక్రమం. భారీస్థాయి అటవీకరణ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పర్యావరణ కార్య‌క్ర‌మం.

This post was last modified on June 12, 2026 9:32 am

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

38 minutes ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

2 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

2 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

3 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

4 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

6 hours ago