ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపణలున్న లిక్కర్ స్కాంపై విచారణను వేగిరం చేసిన ఈడీ అధికారులు.. గురువారం రెండు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటుగా పాత్ర ఉందని భావిస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు… ఈ కేసులో కీలక నిందితులుగా పరిగణిస్తున్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డిలను అరెస్ట్ చేసింది.
రాజ్ కేసిరెడ్డి వైసీపీ హాయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేయగా… ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా వాసుదేవ రెడ్డి పనిచేశారు. ఈ ఇద్దరే ఈ కేసులో అత్యంత కీలకమైన నిందితులు. వీరి ఆధ్వర్యంలోనే మొత్తం వ్యవహారం నడిచిందని ఏపీ సీఐడీతో పాటుగా ఈడీ కూడా భావిస్తోంది. ఇప్పటికే వీరిని ఏపీ సీఐడీ అరెస్టు చేయగా… బెయిల్ పై వీరిద్దరూ బయటకు వచ్చారు. తాజాగా వీరిని ఈడీ అదికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా… నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిని ఈడీ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
మద్యం టెండర్లలో అక్రమాలకు పాల్పడిన నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు వేలాది కోట్ల రూపాయల మేర అక్రమంగా సంపాదించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. తాజాగా ఈడీ దర్యాప్తులో భాగంగా మద్యం రవాణాలోనూ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలు అక్రమాలకు తెర తీశారని తేలింది. ఈ రెండో అంశంలోనే వారిద్దరినీ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఇక మద్యం రవాణాలో చోటుచేసుకున్న అక్రమాల ద్వారానే నిందితులు రూ.195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లుగా ఈడీ తేల్చింది. దీనికి సంబందించి ఆధారాలను వెలికితీసిన తర్వాతే ఆ ఇద్దరు రెడ్లను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ కేసులో మాదిరిగా ఈ కేసులో వారిద్దరికీ బెయిల్ అంత సులభంగా అయితే లభించే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ఈ మద్యం అక్రమ రవాణాకు సంబందించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ లకు ప్రత్యక్ష సంబంధమున్నట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే తండ్రీకొడుకుల ఇళ్లల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు… రోలెక్స్ వాచీలు, కార్లతో పాటు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కాపీలను స్వాదీనం చేసుకుంది. వీటి ఆధారంగా త్వరలోనే కారుమూరి తండ్రీకొడుకులు కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 12, 2026 6:29 am
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…