Movie News

సింగ్ గీతం… టాలీవుడ్ అదృష్టం

ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే టాలీవుడ్ ఒక అదృష్టానికి నోచుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 94 వయసులో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఈ సినిమాని తెరకెక్కించడం కొన్ని వేల మందికి స్ఫూర్తినివ్వడం ఖాయం. అలాని ఆయనేదో అవుట్ అఫ్ ట్రెండ్ మూవీ తీశారనుకుంటే పొరపాటే. ప్రీమియర్ రిపోర్ట్స్ ఇదే స్పష్టం చేస్తున్నాయి.

సంగీతాన్ని ప్రధానంగా వాడుకుంటూ పాత్రల మధ్య బంధాలను, కథలోని సంఘర్షణకు ఇంత కొత్తగా ఎవరు చెప్పగలరన్న రీతిలో సింగీతం వారి స్క్రీన్ ప్లే మేజిక్ చేసిందనే చెప్పాలి. సగటు మాస్ ప్రేక్షకులకు ఇలాంటివి ఏ మేరకు కనెక్ట్ అవుతాయో చెప్పలేం కానీ గత కొన్నేళ్లలో వచ్చిన చాలా మూస చిత్రాల కంటే ఈ సింగ్ గీతం ఎన్నోరెట్లు మెరుగ్గా ఉన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కొన్ని ఫ్రేమ్స్, సీన్స్ చూస్తే అసలీయన ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నుంచి సంగీతాన్ని రాబట్టుకున్న వైనం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది . డైరెక్షన్, నిర్మాణంలో నాగ్ అశ్విన్ చేయూత ఉండొచ్చు గాక. అయినా సరే సింగీతం వారి ముద్ర ఆణువణువూ ఉట్టి పడుతుంది. న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ పేరుతో బోల్డ్ కంటెంట్, హింసని జనాల మీద రుద్దుతూ ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయని చెప్పుకునే ఎందరో దర్శకులకు సింగీతం వారు తీసుకున్న చిన్న క్లాసుగా ఈ సింగ్ గీతంని వర్ణించవచ్చు.

కొందరికి ఇక్కడ చెప్పినంత గొప్పగా సినిమా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ ప్రయత్న లోపం లేని ఒక నిజాయితిని ఆవిష్కరించారని మాత్రం బల్లగుద్ది చెప్పొచ్చు. అందులోనూ స్టార్ క్యాస్టింగ్ లేకుండా కొత్త జంటను తీసుకుని ఈ ఎక్స్ పరిమెంట్ చేయడం అంటే మాటలు కాదు. మూవీ లవర్స్ మిస్ చేయకూడని అనుభూతి ఇది. సింగీతం శ్రీనివాసరావు గారి సాహసానికి ఒక వేదిక ఇచ్చే అదృష్టం అందుకున్న ఘనత వైజయంతికి కాదు యావత్ టాలీవుడ్ కు దక్కుతుంది.

This post was last modified on June 12, 2026 9:58 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

8 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

58 minutes ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago