Political News

లిక్కర్ స్కాంలో ‘కారుమూరి’కీ పాత్ర ఉందా…?

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్న ఈ కుంభకోణంలో తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వైసీపీ హాయంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేరు ఇప్పుడు ఈ కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తోంది. గురువారం ఈ స్కాంకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన సోదాల్లో కారుమూరి నివాసంతో పాటు ఆయన కార్యాలయాలు కూడా ఉన్నాయి.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి.,.. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచిన కారుమూరి… 2019లో వైసీపీ తరపున అదే తణుకు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాదించారు.

తణుకు పరిధిలోని అత్తిలికి చెందిన కారుమూరి హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తణుకు వైసీపీ ఇంచార్జీగా కూడా కొనసాగుతున్న కారుమూరి ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

2019లో వైసీపీ అదికారంలోకి వచ్చాక…జగన్ తొలి కేబినెట్ లో కారుమూరికి బెర్త్ దొరకలేదు. అయితే జగన్ తన కేబినెట్ ను ప్రక్షాళన చేస్తూ చాలా మందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం కల్పించగా… అప్పటిదాకా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరికి అవకాశం దక్కింది. జగన్ సీఎంగా దిగిపోయేదాకా కారుమూరి మంత్రిగా కొనసాగగా… ఆయనపై నాడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.

లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన అఫిడవిట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన నేరాల విషయంలో లోతైన దర్యాప్తు చేయడంలో దిట్టగా పేరు సంపాదించిన ఈడీ… ఏపీ లిక్కర్ కేసులో కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే గురువారం నాటి సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు కారుమూరి ఇంటిలో వాలిపోయారు. కారుమూరి వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో జరిగిన లావాదేవీలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on June 11, 2026 7:25 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

7 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

9 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

9 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

9 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

11 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

12 hours ago