ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి సాయం పుష్కలంగా ఉందన్నారు. దీనికి తాము కేంద్రానికి రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. బీవీజీ రామ్‌జీ పథకం కింద.. 7 వేల కోట్ల రూపాయలు తాజాగా ఇచ్చారని తెలిపారు. దీనికి ముందు కూడా ఎక్కడా అన్యాయం జరగలేదని తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగి స్తున్నామని చెప్పారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.
వైసీపీపై..
గత ప్రభుత్వం అంటూ.. వైసీపీపై పవన్ విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన సొమ్ములు ఎటు పోయాయో అంతు చిక్కడం లేదన్నారు. అన్ని రంగాలను గత ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. కేంద్రం నుంచి తెచ్చిన సొమ్ములతో అభివృద్ధి పనులు చేపట్టి ఉంటే.. ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలను అభివృద్ధి చేశామని.. దీనికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణమని పేర్కొన్నారు. ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పంచాయతీ సర్పంచులకు.. చెక్ పవర్ ఇచ్చామని తెలిపారు. నిధులు కూడా అందిస్తున్నామన్నారు.
కూటమి పదిలం..
కూటమి ప్రభుత్వం పదిలంగా ఉందని పవన్ చెప్పారు. కొందరు కూటమిపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని గుర్తించామని తెలిపారు. మూడు పార్టీలు కలిసే ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా సుస్థిర ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహకారంతో సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామన్న ఆయన.. ఏపీని ఓ రేంజ్‌కు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని చెప్పారు. చిన్న చిన్న వివాదాలు ప్రతి పార్టీలోనూ ఉన్నవేనని.. వీటిని చర్చించుకునే పరిష్కరించుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇవి కూటమిని ఏమీ చేయలేవని తెలిపారు. తమ లక్ష్యం స్వర్ణాంధ్ర సాకారమేనని పవన్ తెలిపారు.
పనితీరు బాగుంది..
కూటమి పార్టీల ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉందని పవన్ వ్యాఖ్యానించారు. కొందరు చేసే పనులను అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. దారి తప్పుతున్న వారిని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. అందరూ మాట వింటున్నా రని.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, రాజకీయ వైరుధ్యాలు ఏపీలో లేవని తెలిపారు. అన్నీ బాగానే జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
This post was last modified on June 10, 2026 10:32 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…