Political News

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో అంతర్భాగమైన తెలంగాణలోకి, హైదరాబాద్ లోకి అడుగు పెట్టరాదని తనపై ఆంక్షలు విధించడం సబబు కాదని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను ఇటీవలే చేసిన ‘తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?’ అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ కోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన పవన్ ను జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రతినిధులు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఏఎన్ఐ గుర్తు చేయగా,… పవన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. పాడ్ కాస్ట్ విత్ స్మితా ప్రకాశ్ పేరిట సాగిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో రిలీజ్ కాగా… అందులోని పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏఎన్ఐ ప్రతినిధులు అడిగిన ప్రతి అంశంపైనా ఆయన తనదైన శైలి సమాధానాలు చెబుతూ సాగారు. వెరసి ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణ భారత దేశంలో ఓ అంతర్భాగమని పవన్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తన మాతృభూమి భారతేనని చెప్పిన పవన్… తన మాతృభూమిలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందని చెప్పారు. అక్కడికి రావద్దు, ఇక్కడికి పోవద్దు అని చెప్పడానికి వారెవరు? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన 13 నెలలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని పవన్ ఆరోపించారు. ఈ కారణంగానే తాను తెలంగాణ మీ అయ్య జాగీరా? అనాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

అయినా తెలంగాణలో జనసేనకు లక్షన్నర మంది క్రియాశీల సభ్యులు ఉన్నారని పవన్ గుర్తు చేశారు. వారంతా యాక్టివ్ గా ఉన్నప్పుడు పార్టీ తరఫున తెలంగాణలోనూ తాను తిరగాల్సిందే కదా అని అన్నారు. అయినా జనసేనను స్థాపించిందే తెలంగాణలో కదా అని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో భవిష్యత్తులో తెలంగాణలో జనసేన ఉంటుందని, ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న కోణంలో ఆయన పరోక్షంగానే అయినా సూటిగానే చెప్పారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడే తాను తెలంగాణలో అడుగుపెడుతున్నట్లుగా ఉందా? అంటూ ఆయన ఓ ప్రశ్నను సంధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన సాగిందన్న విషయాన్ని గుర్తు చేసిన పవణ్.. ఆ పదేళ్లలో తనను ఎవరూ ఏమీ అనలేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాకే… ప్రాంతీయ విద్వేషాలు పెరిగిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తెలంగాణకు రావద్దని కాంగ్రెస్ అంటే… ఉత్తరాదికి చెందిన రాహుల్ గాంధీ దక్షిణాదికి ఎలా వస్తారని తానూ అంటానని పవన్ మరింత సంచలన వ్యాఖ్య చేశారు.

This post was last modified on June 10, 2026 9:37 pm

Share

Recent Posts

డిజాస్టర్లు పడుతున్నా వేగం తగ్గట్లేదు

మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేయడంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పుడూ ముందు వరసలో…

2 hours ago

టాటా పంచాయితీ కోర్టు మెట్లు ఎక్కనుందా?

దేశంలో అతిపెద్ద వ్యాపార గ్రూపుల్లో ఒకటైన టాటాలో ఇప్పుడు కీలకమైన వివాదం కోర్టు వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. టాటా…

2 hours ago

రూ.10 చిల్లర కోసం గొడవ… ఆటో డ్రైవర్ మృతి

హైదరాబాద్‌లో కేవలం రూ.10 చిల్లర విషయంలో మొదలైన గొడవ ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు పోయే వరకు వెళ్లింది. రాజేంద్రనగర్…

2 hours ago

కబాలి ద‌ర్శ‌కుడు అద‌ర‌గొట్టేశాడుగా..

త‌న‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నపుడు క‌బాలి, కాలా సినిమాల‌తో నిరాశ‌ప‌రిచాడు కానీ.. పా.రంజిత్ గొప్ప ద‌ర్శ‌కుడ‌న‌డంలో సందేహం లేదు. తొలి…

2 hours ago

సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు

ఏమాత్రం అవకాశం దొరికినా చాలు మహిళలను లొంగదీసుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. పెద్ద మనుషుల ముసుగులో హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా…

3 hours ago

న్యాచురల్ కాదు… ఇకపై అల్ట్రా కమర్షియల్

ఇప్పటిదాకా న్యాచురల్ స్టార్ ట్యాగ్ తో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటూ వచ్చిన నాని దసరా, హిట్…

4 hours ago