సినీ ప్రియులను అంతులేని విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలలో అభిమానులు గతాన్ని తలుచుకుంటున్నారు. పేరు తెచ్చుకుంది తమిళంలోనే అయినా భారతీరాజాగారికి టాలీవుడ్ తోనూ మంచి కనెక్షన్ ఉంది. ముఖ్యంగా ఆరాధన గురించి చెప్పుకోవాలి. సందీప్ రెడ్డి వంగా ఆఫీసులో చిరంజీవి కోపంగా చూస్తున్న ఫోటో ఒకటి నిలువెత్తు రూపంలో ఉంటుంది. అది భారతీరాజా సృష్టించిన పులిరాజు క్యారెక్టర్.
దీని వెనుక విశేషాలు ఓసారి గుర్తు చేసుకుందాం. 1986లో భారతీరాజా తమిళంలో ‘కడలోర కవితైగల్’ తీశారు. నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్న సత్యరాజ్ హీరోగా రేఖ హీరోయిన్ గా తెరకెక్కించారు. బాధ్యత లేకుండా వీధుల్లో తిరిగే ఒక వీధీ రౌడీకి పాఠాలు చెప్పుకునే స్కూల్ టీచర్ కి మధ్య ప్రేమకథని చాలా హృద్యంగా తీశారు. ఇళయరాజా పాటలు ఊరు వాడా మ్రోగిపోయాయి. దెబ్బకు సత్యరాజ్ స్టార్ అయిపోయారు. ఇది చూసిన చిరంజీవికి రీమేక్ చేయాలనే ఆలోచన కలిగింది.
అనుకోవడమే ఆలస్యం అల్లు అరవింద్ ని భారతీరాజా దగ్గరికి పంపించి తెలుగు వెర్షన్ ఆయనే డైరెక్ట్ చేసేలా ఒప్పించారు. సుప్రీమ్ హీరో కాబట్టి ఆయన ఆలోచించలేదు. ఒరిజినల్ వెర్షన్ ని ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా తీయడంతో జనాలకు నచ్చలేదు. తమిళ డబ్బింగ్ లా ఉందని పెదవి విరిచారు. ఖైదీ, దొంగమొగుడు లాంటి అదిరిపోయే మాస్ పాత్రల్లో చూసిన జనాలకు ఆరాధనలో పులిరాజు నచ్చలేదు. ఫలితంగా సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది.
అయినా సరే చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో సుహాసిని హీరోయిన్ గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా ఉంటారు. తమిళం ట్యూన్సే తీసుకుని తెలుగులో పాటలు చేసి ఇచ్చారు ఇళయరాజా. ముఖ్యంగా అరె ఏమైంది సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. తర్వాతి రోజులలో భారతీరాజాతో చేయాలని ఎందరో హీరోలు ప్రయత్నించారు కానీ ఆ ఛాన్స్ చిరంజీవికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రమే దొరికింది.
This post was last modified on June 10, 2026 9:40 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…