Political News

రాహుల్ పై పోస్టర్లు!… ఎవరి పని?

జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమిలోని దాదాపుగా అన్ని పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమనే చెప్పాలి. ఇంతటి కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రాహుల్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను ఎవరు అంటించారన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇప్పటికే రెండు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలతో రాహుల్ గాంధీ సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఓర్పు, సహనంతో సాగుతున్న రాహుల్ హస్తం పార్టీనీ ఎలాగోలా అధికారంలోకి తీసుకురావాలన్న కసితో పనిచేస్తున్నారు. రాహుల్ పనితీరు కారణంగానే.. కేరళలో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందన్న శుభ సూచనలు కనిపించాయి. అయితే కీలక భేటీ సమయంలో రాహుల్ పై దుమ్మెత్తిపోస్తు దేశ రాజదానిలో పోస్టర్లు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాహుల్ గాంధీకి ఏ విషయంలోనూ స్థిరత్వం లేదని, కాంగ్రెస్ పార్టీ ఓ విశ్వాసం లేని పార్టీ అని, ఆ పార్టీని నమ్మలేమని… ఇలా పలు కోణాల్లో ఆ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఆయా సందర్భాల్లో ఇండియా కూటమిలోని నేతలు ఆయా సందర్భాలను బట్టి చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరు అంటించారో తెలియదు గానీ… ఇప్పుడీ పోస్టర్లు తెర వైరల్ అవుతున్నాయి.

ఈ పోస్టర్లలో డీఎంకే నేతలతో పాటు తృనమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆప్ తదితర పార్టీల నేతలు ఆయా సందర్భాల్లో రాహుల్ గురించి గానీ, కాంగ్రెస్ గురించి గానీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడీ పోస్టర్లలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న ఈ పార్టీల నేతలే రాహుల్ ను, కాంగ్రెస్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని చెప్పడం ద్వారా కూటమి పటిష్ఠతను దెబ్బ తీసే దిశగానే ఈ పోస్టర్లు వెలిశాయన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… ఈ భేటీకి తమిళనాడు నుంచి ఏ ఒక్క పార్టీ కూడా హాజరు కాలేదు. తమిళనాడుకు సంబంధించి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీతో డీఎంకే జట్టు కట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల తర్వాత డీఎంకేను వదిలేసిన కాంగ్రెస్ విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు పలికింది. దీంతో ఈ భేటీని డీఎంకే బాయి కాట్ చేసింది.

ఇక కొత్త మిత్రుడైన టీవీకేకు ఎంపీలు లేనందున కూటమి నుంచి ఆ పార్టీకి ఆహ్వానమే అందలేట. ఇక ఢిల్లీలో పుట్టి… స్తానికంగా ఓ బలమైన పార్టీగా పేరుగాంచిన ఆప్ ను కూడా ఇండియా కూటమి ఈ భేటీకి ఆహ్వానించలేదట. ఇక కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ ఈ భేటీకి హాజరయ్యాయి.

This post was last modified on June 8, 2026 2:37 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

54 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

2 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

4 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

4 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago