Movie News

గాడ్ ఆఫ్ వార్ గురించి త‌మ‌న్ హింట్?

త్రివిక్ర‌మ్ కెరీర్లో అత్యంత క్యూరియాసిటీ రేకెత్తిస్తున్న చిత్రం.. గాడ్ ఆఫ్ వార్. ఇండియ‌న్ మైథాల‌జీలో పెద్ద‌గా ట‌చ్ చేయ‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి క‌థ‌ను తెర‌పైకి తేవాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్ర‌య‌త్నం. ఎప్పుడో ఈ చిత్రానికి స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ కొన్ని కార‌ణాల‌తో అది ఆల‌స్యం అవుతోంది. ఆద‌ర్శ కుటుంబం త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తాడ‌నే అంచ‌నాలున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఇందులో లీడ్ రోల్‌లో చూడ‌బోతున్నామ‌ని ఆశిస్తున్నారు అభిమానులు. కానీ దీని గురించి ఎప్పుడు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందో తెలియ‌ట్లేదు. కానీ త్రివిక్ర‌మ్‌కు చాలా స‌న్నిహితుడైన సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఈ సినిమా గురించి ఊరిస్తూనే ఉన్నాడు.

తాజాగా ఒక ఈవెంట్లో ఓ విలేక‌రి నుంచి త‌మ‌న్‌కు ఆస‌క్తిక‌ర ప్రశ్న ఎదురైంది. ఇప్ప‌టిదాకా మైథాల‌జీ సినిమాకు ప‌ని చేయ‌లేదు, భ‌విష్య‌త్తులో అలాంటి సినిమాలో భాగం అవుతారా అని అడిగితే.. అతి త్వ‌ర‌లో అది సాధ్య ప‌డుతుంద‌న్నాడు. అది గాడ్ ఆఫ్ వార్ మూవీయేనా అని అడిగితే.. గాడ్ బ్లెస్ యు బ్ర‌ద‌ర్ అంటూ న‌వ్వేశాడు త‌మ‌న్. దీన్ని బ‌ట్టి త్రివిక్ర‌మ్ త‌ర్వాత తీయ‌బోయేది గాడ్ ఆఫ్ వార్ మూవీయే అని, అందులో త‌మ‌న్ భాగం అవుతున్నాడ‌ని అర్థః చేసుకోవ‌చ్చు.

మ‌రోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ య‌ల్ల‌మ్మ మూవీతో హీరో అవుతున్నాడు, మ‌రి మీ సంగ‌తేంటి అని అడిగితే.. త‌మ‌న్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. తాను ఎప్పుడో కెరీర్ ఆరంభంలోనే బాయ్స్ సినిమాలో వ‌న్ ఆఫ్ ద హీరోస్‌గా న‌టించిన విష‌యాన్ని గుర్తు చేశాడు త‌మ‌న్. హీరోగా న‌టించ‌డం అంత సులువైన విష‌యం కాద‌ని ఈ సంద‌ర్భంగా త‌మ‌న్ వ్యాఖ్యానించాడు. ఎండ‌లో క‌ష్ట‌ప‌డి వ‌డ‌దెబ్బ‌లు త‌గిలించుకోవ‌డం ఎందుకు, హాయిగా ఏసీలో కూర్చుని ట్యూన్లు చేసుకోవ‌చ్చు క‌దా అంటూ న‌వ్వేశాడు త‌మ‌న్.

ఇక దేవి న‌టిస్తున్న య‌ల్ల‌మ్మ గురించి త‌మ‌న్ స్పందిస్తూ.. ఆ సినిమా క‌థ తాను కూడా విన్నాన‌ని, అది క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యే సినిమా అని చెబుతూ.. దేవికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ మ‌ధ్య వ‌చ్చిన పాట‌ల్లో ఏఆర్ రెహ‌మాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి త‌న ఫేవ‌రెట్ అని.. ఎయిర్ పోర్టుకి వెళ్తూ తాను ఆ పాటే వింటాన‌ని త‌మ‌న్ వెల్ల‌డించాడు. ఈ వ‌య‌సులో కూడా ఇళ‌య‌రాజా ఒక స్టూడియో క‌ట్ట‌డం ఎంత గొప్ప విష‌యం అంటూ మాస్ట్రోను కొనియాడాడు త‌మ‌న్.

This post was last modified on June 8, 2026 11:12 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

11 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago