ప‌వ‌న్‌కు గ‌ద్ద‌ర్ కుమార్తె కౌంట‌ర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుమార్తె వెన్నెల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ఖండించారు. ఒక న‌టుడిగా.. గ‌ద్ద‌ర్ అభిమానిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గౌర‌వం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

అయితే.. తెలంగాణ త‌మ జాగీరేన‌ని వెన్నెల వ్యాఖ్యానించారు. తెలంగాణ మా అయ్య‌ల జాగీరు. ఇప్పుడు మా జాగీరు.. రేపు మా బిడ్డ‌ల జాగీరు అని అన్నారు. తెలంగాణ సినిమాల్లో న‌టిస్తే రాలేద‌న్నారు. పైస‌లు పంచితే రాలేద‌ని చెప్పారు. లాబీయింగ్ చేస్తే తెలంగాణ రాలేద‌ని పేర్కొన్నారు.

కొన్ని వేల మంది త‌మ ర‌క్తం చిందిస్తే.. కొన్ని వేల మంది ఉద్యోగాల‌ను, జీవితాల‌ను ఫ‌ణంగా పెడితే తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఇక్క‌డి త‌ల్లులు త‌మ బిడ్డ‌ల‌ను కోల్పోయార‌ని వెన్నెల తెలిపారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ ను అభిమానిస్తామ‌న్నారు.

ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్ కౌంట‌ర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు. అని వెన్నెల తెలిపారు.

తెలంగాణ ఒక సాయుధ పోరాట‌మ‌ని, ఆత్మ‌గౌర‌వ పోరాట‌మ‌ని అన్నారు త‌మ‌ను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారి ఒక సాక్ష్య‌మ‌ని వెన్నెల పేర్కొన్నారు. తెలంగాణ ఒక చారిత్ర‌క పోరాట‌మ‌ని.. పాటతోను, మాట తోను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసిన పోరాట‌మ‌ని చెప్పారు.

తొలిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో 2 వేల మంది, మ‌లిద‌శ ఉద్య‌మంలో 1200 మంది ప్రాణాలు అర్పిస్తే ఈ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని తెలిపారు. అలాంటి తెలంగాణ‌.. నిన్న త‌మ తండ్రుల జాగీర‌ని.. నేడు త‌మ జాగీర‌ని.. రేపు త‌మ ముందు త‌రాల జాగీర‌ని అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డ‌గా ఇక్క‌డి బిడ్డ‌ల పోరాటంతోనే తెలంగాణ సాకార‌మైంద‌ని చెబుతున్నాన‌న్నారు.

ఆగ‌ని విమ‌ర్శ‌లు!

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు. పార్టీలతోపాటు.. పలువురు ఉద్య‌మ నాయ‌కులు కూడా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డుతున్నారు. ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సైతం ప‌వ‌న్‌ను త‌ప్పుబ‌ట్టారు. అయితే.. దీనికి ప్ర‌తిగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న‌దైన శైలిలో స్పందిస్తున్న గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ర‌చించిన ప్ర‌ముఖ కావ్యం రాస్తాలోని పంక్తుల‌ను ఆయ‌న కోట్ చేశారు. అనంత‌రం.. త‌న వాస్త‌వ ఉద్దేశం ఇదీ.. అంటూ సోష‌ల్ మీడియాలోను పోస్టు చేశారు. ఇలా.. ప‌ర‌స్ప‌రం.. తెలంగాణ విష‌యంలో కామెంట్లు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.