టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రషా తదాని కి మొదటి సినిమా రూపంలో ఫ్లాప్ ఎదురయ్యింది. ఘట్టమనేని మూడో తరం మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూకి ఆశించిన ఫలితం దక్కేలా లేదు. కుర్రాడు బాగానే నటించినప్పటికీ మిగిలిన అంశాలు రొటీన్ గా ఉండటం వల్ల దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఆశించింది ఇది కాదని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.
ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. రషా తదాని తల్లి రవీనాటాండన్ 1993లో తొలి తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ కలయికలో శరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే పాటలు పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా రాజ్ కోటి కంపోజ్ చేసిన నర్మదా నది తీరంలో సాంగ్ బాగా పాపులర్. అదే సంవత్సరం బాలకృష్ణ బంగారు బుల్లోడు ఛాన్స్ దక్కించుకున్న రవీనాటాండన్ రెండో ప్రయత్నంలో సూపర్ హిట్ అందుకున్నారు.
ఇప్పుడు రషా తదానికి కూడా తెరంగేట్రం కోరుకున్నట్టు జరగలేదు కాబట్టి అమ్మ లాగా రెండో సినిమా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. అయితే ఇప్పటికైతే టాలీవుడ్ ఆఫర్స్ ఏవి వచ్చినట్టు లేవు. అందం బాగానే ఉన్నప్పటికీ అభినయం పరంగా రషా ఇంకా తొలి అడుగుల్లోనే ఉంది. భాష సమస్య వల్ల ఎక్స్ ప్రెషన్లు దర్శకులు కోరుకున్నట్టుగా పలకడం లేదు. అందులోనూ మొదటి సినిమాకే కొంచెం వెయిట్ ఉన్న పాత్ర ఇవ్వడం వల్ల మైనస్సులు ఎక్కువ బయట పడ్డాయి.
ఇంకో విషయం ఏంటంటే రషా తదాని బాలీవుడ్ తొలి చిత్రం ఆజాద్ కూడా డిజాస్టరే. అజయ్ దేవగన్ కొడుకుతో కలిసి పరిచయం చేస్తే అదేమో దారుణంగా పోయింది. స్టార్ క్యామియో పెట్టిన లాభం లేకపోయింది. కాకపోతే తన పెర్ఫార్మన్స్ కి ఆజాద్ లో అయితే డీసెంట్ మార్కులు పడ్డాయి. రవీనా కూడా కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు చూసింది. మోహ్రా లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కుదురుకుంది. స్టార్ట్ గా చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. మరి రషాకు ఎవరు బ్రేక్ ఇస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
