కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ‘గద్దలకొండ గణేష్’ సమయంలో వరుణ్ బాక్సాఫీస్ పొటెన్షియల్ చాలా బలంగా ఉండేది. ఆ టైమ్‌లో వరుణ్ సినిమాలకు 20 నుంచి 25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచేది. అయితే F3 మినహా ఆ తర్వాత వచ్చిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి సినిమాలు వరుసగా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో మార్కెట్ లో ప్రాజెక్ట్‌లపై లెక్కలు కాస్త మారాయి.

గతంతో పోలిస్తే, కనకరాజు సినిమాకు మేకర్స్ 15 కోట్ల కంటే తక్కువగానే, చాలా రీజనబుల్ అండ్ రికవరేబుల్ రేంజ్‌లోనే థియేట్రికల్ వాల్యుయేషన్స్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి వరుణ్ రెమ్యునరేషన్ లో తగ్గక తప్పలేదు. ఇక బడ్జెట్ కూడా తక్కువే. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఆంధ్రా ప్రాంతంతో పాటు మిగతా టెరిటరీస్ లో లెక్క ఏమాత్రం రిస్కీగా లేదని తెలుస్తోంది. టాక్ బాగుంటే మొదటి నాలుగైదు రోజుల్లోనే రేట్లు రికవరి అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ఈ లెక్కలపై మేకర్స్ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇక ప్రొడ్యూసర్‌కు నాన్ థియేట్రికల్ రూపంలో డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా సాలిడ్ సేఫ్టీ నెట్ లభించినట్లు సమాచారం. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హారర్ కామెడీ జానర్‌కు ఉన్న ఆదరణ, డిమాండ్ అందరికీ తెలిసిందే.

కథలో నవ్వులతో పాటు కాస్త థ్రిల్ ఉంటే ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. గత సినిమాల ఫలితాల ప్రభావం బిజినెస్ పై పడినా, రీజనబుల్ థియేట్రికల్ టార్గెట్‌తో రావడం అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మొదటి ఆట నుంచే టాక్ పాజిటివ్‌గా వస్తే మాత్రం, వరుణ్ తేజ్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.