Political News

విగ్రహాల ధ్వంసం… జగన్ పై జీవి ఆంజనేయులు ఆరోపణలు

ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ పాత్ర ఉందని ఇప్పటికే అధికార టీడీపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ జమ్ములయ్య అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తేనని పోలీసులు కూడా నిర్ధారించిన తీరుతో వైసీపీ పరిస్థితి మరింతగా దిగజారిందని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీపైనా, ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ పైనా సంచలన ఆరోపణలు గుప్పించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ తీరుపై మండిపడ్డ ఆంజనేయులు… రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనేలా వైసీపీనే వైఎస్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య… వైసీపీకి చెందిన వాడేనని ఏకంగా పోలీసులే నిర్ధారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఏపీని రావణ కాష్టంగా మార్చే దిశగానే వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఈ తరహా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు.

ఇక మొన్నటి ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నెరపిన అవినీతి అక్రమాలపైనా ఆంజనేయులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో నకిలీ పత్రాలతో పాటు నకిలీ జీవోలను సృష్టించి మరీ బ్రహ్మనాయుడు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోచేశారన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడుతో పాటుగా ఇతర వైసీపీ నేతలకు హస్తముందని ఆయన ఆరోపించారు. ఇక బ్రాహ్మణపల్లిలో బ్రహ్మనాయుడు పాల్పడ్డ భూకుంభకోణంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ కూ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపించారు. ఈ భూదందాలో జగన్ ఏ మేర వాటా తీసుకున్నారన్న విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 

This post was last modified on June 1, 2026 7:57 pm

Share

Recent Posts

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

10 minutes ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

1 hour ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

3 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago