Political News

సీఎం అయినా విజయ్ లో తృప్తి లేదే!

మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి రాజకీయాల్లోకి దూకేశారు. తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట పార్టీని పెట్టిన ఆయన ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విక్టరీ సాదించారు. ఏ ఒక్కరి అంచనాలకు అందని రీతిలో ఆయన ఏకంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా కూడా విజయ్ లో ఏమాత్రం తృప్తి లేదన్న మాట వినిపిస్తోంది. సోమవారం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తిరుచ్చి ఈష్ట్ ప్రజలను ఉద్దేశించి విజయ్ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

పెరంబూర్ తో పాటు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్… రెండు చోట్లా విజయం సాధించారు. ఈ క్రమంలో పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు సిద్ధపడ్డ విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గెలింపిచిన తిరుచ్చి ఈస్ట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు విజయ్ సోమవారం తిరుచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా తిరుచ్చి ప్రజలను ఉద్దేశించి విజయ్ భావోద్వేగ ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడింది తిరుచ్చి ఈస్ట్ ప్రజల గురించే అయినా… మొత్తం రాష్ట్ర ప్రజలకు అన్వయించేలా విజయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అయినా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన తమిళ ఓటర్లను కోరారు. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే ఆవిర్భవించినా… రెండు ప్రధాన పార్టీలు తనను సీఎం కాకుండా అడ్డుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఇబ్బందులు లేకుండా వచ్చే సారి అయినా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన తమిళ ప్రజలను కోరారు.

విజయ్ నోట నుంచి ఈ మాట వచ్చినంతనే… సీఎం పదవి దక్కినా విజయ్ లో ఇంకా అసంతృప్తి ఛాయలే కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజమే మరి… ఎన్నికల్లో విజయ్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా.. ఆయన సీఎంగా పదవీ ప్రమాణం చేయడానికి ఏకంగా వారం రోజుల సమయం పట్టింది.

అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడింది కాబట్టి సరిపోయింది గానీ… లేదంటే విజయ్ సీఎంగా పదవీ ప్రమాణమే చేసే వారు కాదేమో. తనకు ఎదురైన అనుభవాలను నిత్యం గుర్తు చేసుకుంటూ సాగుతున్న విజయ్… తదుపరి ఎన్నికల్లో అయినా తనకు సంపూర్ణ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా తనను అడ్డుకునే వారికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరినట్టైందని చెప్పాలి.

ఇక రాజకీయాలకే కొత్త కాకుండా సీఎం పదవికి కూడా తాను కొత్త అని వైరి వర్గాలు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా విజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తనకు ఓ 6 నెలల సమయం ఇచ్చి చూద్దామని చాలా పార్టీల నేతలు బహిరంగంగా ప్రకటించారని విజయ్ గుర్తు చేశారు. 6 నెలలు కాదు కదా… కనీసం ఆరు రోజులు కూడా వేచి చూడకుండానే తన పాలనపై ఆయా పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం మంచి మాత్రమే చేస్తుందని, తనను గెలిపించిన ప్రజలకు తాను ఇదే మాటను అమలు చేసి చూపిస్తానని విజయ్ అన్నారు.

This post was last modified on June 1, 2026 8:01 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

2 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago