Political News

లెక్కలన్నీ ఆరోజు తేలుస్తారా పవన్?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారా..? ఇటీవల ఆయన చుట్టూ నెలకొన్న వివాదాలు, విమర్శల మధ్య జూన్ 2న తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో హైదరాబాదులో సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ సమావేశం జరగడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరామర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అనంతరం జరిగిన ఓ టెలివిజన్ చర్చలో రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

ఆ వ్యాఖ్యలపై కేసులు నమోదవగా, అనంతరం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్ కూడా అరెస్టు వంటి చర్యలు అవసరం లేదని వ్యాఖ్యానించడంతో వివాదం కొంత సద్దుమణిగింది.

అయితే ఆ తరువాత కూడా కొందరు రాజకీయ నేతలు, సామాజిక వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు కొనసాగించారు. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపించింది. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జనసేన పార్టీ ఆవిర్భావ ప్రకటన కూడా హైదరాబాద్‌లోనే జరగడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభమైందని, రాష్ట్రంతో పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు.

జూన్ 2న జరిగే సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో జనసేన స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తుందా? అన్న అంశాలపై కూడా ఈ సమావేశం కొంత స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు, పార్టీ ప్రకటించే కార్యాచరణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

This post was last modified on May 31, 2026 2:29 pm

Share

Recent Posts

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

10 minutes ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

41 minutes ago

తెలుగు తమిళ స్టార్ కమెడియన్లు కలిస్తే

మల్టీస్టారర్లు మాములుగా స్టార్ హీరోల గురించే ఎక్కువగా వాడతాం. ఆర్ఆర్ఆర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉదాహరణగా చెప్పుకుంటాం. అయితే…

54 minutes ago

ట్రాఫిక్ చలాన్… కరెంట్ బిల్లుతో వసూలు చేస్తారా?

ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…

5 hours ago

అనిరుధ్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…

6 hours ago

ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…

6 hours ago