జనవరిలో జన నాయగన్ కు సెన్సార్ అడ్డంకులు తలెత్తినప్పుడు విజయ్ కేవలం ఒక స్టార్ హీరో. రాజకీయంగా ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్నాడు. అందుకే ఏమి చేయలేని పరిస్థితి. అయిదు నెలల తర్వాత సీన్ మారిపోయింది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. మొదటి విడతలోనే పదవి చేపట్టిన అరుదైన ఘనత అందుకున్నాడు. సింగల్ గా పోటీ చేసి ఎవరితో ముందస్తు పొత్తు లేకుండా విజయం సాధించడం చరిత్ర అంత సులభంగా మర్చిపోదు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
జన నాయకుడుని గతంలో నియమించిన రివైజింగ్ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి. అది కోర్టు పరిశీలనకు వచ్చిన తర్వాత సెన్సార్ అధికారులు చర్యలు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఆ దిశగా ఎలాంటి మూమెంట్ లేకపోవడం విజయ్ అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే జూన్ 19 ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం తమిళనాడు బయ్యర్ వర్గాల్లో బలంగా ఉంది. కానీ ఇప్పటిదాకా అప్డేట్ లేకపోవడం వాళ్ళను కలవరపెడుతోంది.
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో దర్శకుడు హెచ్ వినోత్ మాట్లాడుతూ ఈ సినిమా వెనుక ఏం జరిగిందో చెప్పే ధైర్యం తనకు లేదని, ఒకవేళ చెప్పినా దాన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం మీకు లేదని ఛానల్ ని ఉద్దేశించి చెప్పడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ లో ఉన్న హీరోని పెట్టుకుని కూడా అతను ఓపెన్ గా ఏదీ బయట పెట్టలేకపోవడం చూస్తే ఏదో పెద్ద రహస్యమే ఉందని సినీ రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఇదో కొత్త చర్చకు దారి తీస్తోంది. వీలైనంత త్వరగా ఇష్యూస్ క్లియర్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా దీన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో మమిత బైజు మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయగన్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. జూన్ రిలీజ్ మిస్ అయితే ఇంకో నెల అదనంగా ఎదురు చూడాల్సి రావొచ్చు.
This post was last modified on May 31, 2026 2:05 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…