ఇండియా గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తమిళ సినిమా ప్రయాణం మొదలుపెట్టి రెండు ఆస్కార్ అవార్డులు గెలిచే స్థాయికి ఎదిగిన గ్లోబల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. దేశ సినీ సంగీత చరిత్రలోనే నంబర్ వన్ స్థానానికి ఆయన గట్టి పోటీదారు. అలాంటి లెజెండరీ సంగీత దర్శకుడు.. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి, తెలుగు సినీ పరిశ్రమ గురించి చెన్నైలో జరిగిన పెద్ది ప్రమోషనల్ ప్రెస్ మీట్లో చాలా గొప్పగా మాట్లాడాడు.
చిరంజీవి ఒక పెద్ద లెజెండ్ అని, ఎంతో సాధించిన అలాంటి వ్యక్తి కొడుగ్గా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ సొంత పేరు సంపాదించుకోవడం అంత తేలికైన విషయం కాదని, అది రామ్ చరణ్ సాధించాడని, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడని రెహమాన్ కొనియాడాడు. తనకూ ఒక కొడుకు ఉన్నాడని, అతను రామ్ చరణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని తనను మించి ఎదగాలని కోరుకుంటున్నానని రెహమాన్ వ్యాఖ్యానించాడు.
ఇక తెలుగు సినీ పరిశ్రమ గురించి కూడా రెహమాన్ చాలా గొప్పగా మాట్లాడాడు. ఈ మధ్య తెలుగు సినిమా ఎంతో ఎదిగిందని.. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి అద్భుతాలు చేస్తున్నారని.. ఇలాంటి ఇండస్ట్రీలో తాను కూడా భాగం కావడం ఎంతో గొప్పగా అనిపిస్తోందని రెహమాన్ వ్యాఖ్యానించాడు.
ఇక్కడ ఇంతకుముందే సినిమాలు చేసినప్పటికీ.. పెద్ది తనకు తొలి తెలుగు సినిమాలా అనిపిస్తోందని రెహమాన్ వ్యాఖ్యానించాడు. టాలీవుడ్ సంగీత దర్శకులు తనను ఇన్‌స్పిరేషన్‌గా చెబుతుంటారని.. కానీ తాను కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందుతున్నానని రెహమాన్ వినమ్రంగా వ్యాఖ్యానించడం విశేషం.
తాను వరుసగా కొంచెం భిన్నమైన, ప్రయోగాత్మక చిత్రలే చేస్తున్న సమయంలో.. సుకుమార్ సిఫారసు ద్వారా బుచ్చిబాబు వచ్చి తనను కలిశాడని, అతను చెప్పిన కథ నచ్చి మనమూ ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనిపించి పెద్ది సినిమాకు పని చేశానని రెహమాన్ తెలిపాడు. బుచ్చిబాబు గొప్ప దర్శకుడని, తనకెంతో నచ్చిన వ్యక్తి అని ఈ సందర్భంగా రెహమాన్ కొనియాడాడు.
This post was last modified on May 31, 2026 11:57 am
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…