Political News

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. మై టిడిపి యాప్ ద్వారా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్న విషయాలను తెలుసుకున్నారు. హాజరు కూడా తీసుకున్నారు. ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ క్లస్టర్ల వారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతం అయింది. అయితే మహానాడును నిర్వహించిన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆసక్తికర చర్చ నడిచింది.

ఎక్కువమంది నాయకులు ఒకే జిల్లాపై దృష్టి పెట్టారు. అదే కడప. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో పాటు ఈ జిల్లాలో ఇటీవల కాలంలో టిడిపి నేతలు మధ్య వివాదాలు తెరమీదకు వచ్చిన పరిస్థితి కనిపించింది. పైగా కొంతమంది సీనియర్ నాయకులను ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు కూడా. కలివిడిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని కడప జిల్లాను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నామని కూడా ఆయన వెల్లడించారు. పెట్టుబడుల విషయంలోనూ సంక్షేమ విషయంలోనూ కడప జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.

ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ కార్యక్రమాలను అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పులివెందుల, కడప, రాజంపేట, జమ్మలమడుగు, మైదుకూరు ఇలా కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ అంతర్గతంగా నాయకుల మధ్య మాట పట్టింపులు ఆధిప‌త్య‌ పోరు, వ్యాపార వ్యవహారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కడప జిల్లాలో మహానాడు ఏ విధంగా నిర్వహిస్తారు.. అనేది పార్టీలో ఆసక్తిగా మారింది. దీంతో జిల్లాలో నిర్వహించిన మహానాడును ఆన్లైన్ వేదికగా తెరమీద ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీనికోసం ఒక ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేసి.. పైన బోర్డును కూడా పెట్టడం విశేషం. దీనిని బట్టి కడప జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యం, కడపలో నాయకులు ఏ విధంగా మహానాడు నిర్వహించారనే అంశంపై పార్టీ అధిష్టానం చూపిన శ్రద్ధ వంటివి స్పష్టమయ్యాయి.

దీనికి తోడు మంగళగిరి వేదికగా జరిగిన మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరు కడప జిల్లాలో ఏం జరుగుతుందని ఆరా తీయడంతో పాటు అక్కడ మహానాడును నిర్వహించే నాయకులతో తరచుగా సంభాషించటం, తెరమీద వీక్షించడం వంటివి కనిపించాయి. అయితే ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ మహానాడును ఘనంగానే నిర్వహించారు. ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహానాడు కార్యక్రమం వైభవంగానే సాగింది. దీంతో నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఒక నియోజకవర్గంలో సరిగా నిర్వహించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం అయింది. ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నాయకుడిపై ఇటీవల విమర్శలు రావడం, వివాదంలో చిక్కుకోవడంతో మహానాడును సరిగా నిర్వహించలేకపోయారు అన్న వాదన వినిపించింది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ అధినేత సొంత జిల్లాలో మహానాడు బాగానే జరగడం కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించడం వంటివి సీనియర్ నాయకులతో పాటు పార్టీకి కూడా సంతృప్తిని కలిగించింది.

This post was last modified on May 30, 2026 7:09 am

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

25 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

5 hours ago