Trends

మానవ అక్రమ రవాణాపై 22 ఏళ్ల పోరు.. చారిత్రక తీర్పు

మానవ అక్రమ రవాణా మాఫియా నెట్ వర్కుకు చెక్ పెట్టేలా.. బాధితులకు ఊరట కలిగించేలా.. దారుణ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల చట్టం మరింత కఠినంగా వ్యవహరించే ఉద్దేశంతో 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. శుక్రవారం చారిత్రాత్మక తీర్పు ఇవ్వటం తెలిసిందే.

ఈ మొత్తం తీర్పును సులువుగా అర్థమయ్యేందుకు కాస్తంత భావస్వేచ్ఛను తీసుకొని చెప్పాల్సి వస్తే.. వ్యభిచారం విషయంలో పోలీసులు కీలకమైన వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ.. వేశ్యవృత్తి అన్నది వయోజనులు స్వచ్ఛందంగా చేస్తున్నారా? బలవంతంగా చేస్తున్నారా? అన్నది గుర్తించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో బలవంతంగా వేశ్యవృత్తిలో ఉన్న వారిని దాని నుంచి రక్షించటం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో సమ్మతితో.. తమ ఇష్టపూర్వకంగా వయోజనులు చేస్తుంటే దానిని అడ్డుకోకూడదని.. వారిని వేధింపులకు గురి చేయొద్దని సుప్రీం చెప్పటం తెలిసిందే.

అయితే.. ఈ తీర్పునకు సంబంధించిన పిల్ 22 ఏళ్ల క్రితం మొదలైంది. నిజానికి ఇప్పుడు తీర్పు మీద అందరూ ఫోకస్ చేస్తున్న అంశానికి బదులుగా ప్రజ్వల సంస్థ తన పిల్ ను న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఈ మొత్తం 22 ఏళ్ల ప్రయాణాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

2004

మానవ అక్రమ రవాణా మాఫియా నెట్ వర్క్ దేశంలో ఎంత తీవ్రంగా ఉందో.. వారి తీరు ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ ప్రజ్వల సంస్థ తరఫున డాక్టర్ సునీతా కృష్ణన్ సుప్రీంకోర్టులో పిల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్) దాఖలు చేశారు. పిల్ దాఖలు చేసిన వారి ప్రధాన ఫిర్యాదు చూస్తే.. అక్రమ రవాణాకు గురైన మహిళలు.. వారి పిల్లలను రక్షించే సమయంలోనూ.. ఆ తర్వాత పునరావాసం కల్పించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నట్లుగా ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

2010-11

ఈ పిల్ తీవ్రతను గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం దేశ వ్యాప్తంగా ఉన్న షెల్టర్ హోమ్స్ స్థితిగతులపై నివేదిక ఇవ్వటానికి ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసింది. అక్రమ రవాణా బాధితులను రక్షించిన అనంతరం వారికి మానసిక స్థైర్యంతో పాటు.. శారీరకంగా వారు ఎదుర్కొన్న హింస నుంచి కోలుకునేందుకు ఉంచేవే ఈ షెల్టర్ హోమ్స్ గా చెప్పాలి. అయితే.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ షెల్టర్ హోమ్స్ జైళ్ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని.. బాధితులకు కనీస మౌలిక వసతులు.. గౌరవం దక్కటం లేదని కోర్టుకు కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

2015-18

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. దీనికి స్పందనగా 2015లో కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అడ్డుకోవటానికి ఒక ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామని.. ఒక సమగ్ర కొత్త చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకు వస్తామని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇక్కడే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో సుప్రీంకోర్టు ఈ పిల్ విచారణను ముగించింది. అయితే.. ప్రభుత్వం కోర్టుకు చెప్పినట్లుగా.. సదరు చట్టాన్ని కానీ.. ఏజెన్సీని కానీ క్షేత్రస్థాయిలో సరిగా అమలు చేయని నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ మరోసారి ప్రజ్వల సంస్థ కోర్టును మరోసారి న్యాయం కోసం ఆశ్రయించింది. దీంతో సుప్రీం ఈ కేసును ముగించకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సుమోటో మానిటరింగ్ కేసుగా మార్చింది.

2022

ఈ కేసు విచారణలో భాగంగా 2022, మే 19న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కీలక ఆదేశాల్ని జారీ చేసింది. సెక్స్ వర్కర్లను పోలీసులు వేధించకూడదని.. వారికి రేషన్ కార్డులు.. ఆధార్ కార్డులు ఇవ్వాలని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

2024-25

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాగేశ్వరరావు రిటైర్ కావటంతో ఈ కేసు విచారణను జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ల ధర్మాసనం స్వీకరించింది. ఇక్కడే ఈ కేసు విచారణ ఒక కొత్త మలుపు తిరిగింది. ఇదే ఈ తాజా తీర్పు చారిత్రాత్మకంగా మారటంతో పాటు.. అసలు పిల్ లోని అంశాల కంటే అందరూ దీనిపైనే మాట్లాడుకోవటానికి కారణమైంది.

ప్రజ్వల సంస్థ మానవ అక్రమ రవాణాను అరికట్టటానికి పోలీసులు కఠినంగా ఉండాలని కోరితే.. సెక్స్ వర్కర్ల సంఘాలు పోలీసులు చట్టాల పేరుతో తమ వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బ తీస్తున్నారంటూ వాదించాయి. పోలీసులు రైడ్స్ పేరుతో ఇష్టపూర్వకంగా ఉన్న జంటలను.. సెక్స్ వర్కర్లను వేధిస్తున్న ఉదంతాలు కోర్టు ముందుకు పెద్ద ఎత్తున వచ్చాయి.

మే 29, 2026
22 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపుగా శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పార్థీవాలా.. జస్టిస్ మహదేవన్ లతో కూడిన ధర్మాసనం కేసుకు సంబంధించిన తుది తీర్పును వెలువరించింది. 22 ఏళ్లుగా ప్రజ్వల సంస్థ కోరుతున్న బాధితుల రక్షణ ప్రణాళికను అధికారికంగా ఆమోదించింది. అంతేకాదు.. దేశ వ్యాప్తంగా దాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.

అదే సమయంలో పోలీసులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం పరస్పర సమ్మతి అనే నిబంధనను తెచ్చి.. సమ్మతితో ఉన్న వయోజనులను వేధించకూడదని స్పష్టం చేసింది. కీలక అంశం ఏమంటే.. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల సంస్థ మానవ అక్రమ రవాణాకు గురైన బాధితుల కన్నీళ్లను తుడిచేందుకు.. వారికి రక్షణ నిలిచేందుకు మొదలైన న్యాయపోరు.. చివరకు పోలీసుల వేధింపుల బారిన తరచూ పడే వారికి రక్షణ కల్పించేలా.. వారి సమ్మతి అన్నది వారి హక్కుగా పేర్కొనటంతో ఈ కేసు తీర్పు చారిత్రాత్మకంగా మారిందని చెప్పాలి.

Kumar

Recent Posts

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక…

40 minutes ago

సమ్మతితో వేశ్యావృత్తి చేస్తే నో కేస్.. స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…

2 hours ago

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…

3 hours ago

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

4 hours ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

4 hours ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

6 hours ago