Political News

జగన్ ‘గ్రీవెన్స్’ మొదలెట్టినట్టేనా…?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ మాదిరిగా ఓ భారీ కార్యక్రమమే నడిచింది.

జగన్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు. వీరిలో జగన్ కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి కంటే జగన్ ను కలిసి ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన వారే అధికంగా ఉన్నారని చెప్పాలి.

జనంలో జగన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ కారణంగానే జగన్ ఎక్కడికి వెళ్లినా… జనం ఆయనను చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. తాజాగా జగన్ తాడేపల్లిలో ఉన్నారన్న విషయం తెలిసిన చాలా మంది ఆయనను చూసేందుకే తాడేపల్లి ఆఫీసుకు వచ్చారు.

తనను కలిసేందుకు వచ్చిన జనాన్ని కలిసేందుకు జగన్ కూడా ఓ మోస్తరు సమయమే కేటాయించినట్లు చెప్పాలి. తాడేపల్లి కార్యాలయానికి వచ్చిన వారిలో దాదాపుగా అందరినీ జగన్ కలిసినట్టుగా చెబుతున్నారు.

సీఎంగా ఉన్న సమయంలో దాదాపుగా తాడేపల్లిలోనే ఉండిపోయిన జగన్… సీఎం కుర్చీ దిగిన తర్వాత తాడేపల్లికి చుట్టపు చూపుగానే వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అదిక సమయం బెంగళూరులోని తన పాలెస్ లో గడుపుతున్న జగన్… ఈ మధ్యే కొంతకాలం పాటు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూడా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే వారంలో కేవలం ఒకటి అరా రోజులు మాత్రమే ఆయన తాడేపల్లిలో ఉంటున్నారు. దీంతో ఆయనను చూడాలనుకునే వైసీపీ శ్రేణులతో పాటు జగన్ తో ఫొటో దిగాలనుకునే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తాడేపల్లికి వస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే మంగళవారం జనంతో తాడేపల్లి కార్యాలయం కిటకిటలాడిందని చెప్పాలి.

This post was last modified on May 27, 2026 4:38 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

52 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago