రాజకీయాల్లో నాయకులు, కార్యకర్తలు.. పార్టీలకు బలమే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, సంఖ్యా బలం ఉంటే సరిపోదు.. అధినేత వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలు.. చేసే వ్యూహాలను కూడా.. కార్యకర్తలు నాయకులు అర్ధం చేసుకోవాలి. ఇది అర్ధం కానంత వరకు ఏ పార్టీ కూడా.. ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీకి కావాల్సినంత మంది కార్యకర్తలు ఉన్నారు. వారు.. పవన్‌పై అభిమానంతో ఉన్నారా? లేక.. పార్టీపై అభిమానంతో ఉన్నారా? అనేది ప్రశ్న.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు.. టీవీకే అధినేత సీఎం విజయ్ రాజకీయాలను ఆయన ప్రస్తావించారు. నేరుగా పేరు పెట్టి చెప్పకపోయినా. కేవలం కటౌట్లు పెట్టి.. అధికారంలోకి వచ్చారని అన్నారు. అయితే.. పవన్ చెప్పినట్టు కేవలం కటౌట్లతోనే విజయ్ రాలేదు. బలమైన కార్యకర్తల విశ్వాసం కనిపించింది. ఎలాగైనా మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్న కసి కూడా ఉంది.
ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించిన విజయ్ సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా.. జనసేనను అభిమానించే కార్యకర్తలు.. పవన్‌కు కటౌట్లు పెట్టే కార్యకర్తలు లేకపోలేదు. కానీ, అర్ధం చేసుకోవడంలోనే వెనుకబడుతున్నారు. టీడీపీతో జనసేన ఎందుకు కూటమిగా వెళ్లిందని ప్రశ్నిస్తే.. ఇప్పటికీ.. చాలా మంది జగన్‌ను ఓడించేందుకే అని చెబుతున్నారు. కానీ.. వాస్తవంలో ఇది పావు వంతే. భిన్నమైన రాజకీయాలు ఉన్న ఏపీలో పార్టీపరంగా బలంగా నిలదొక్కుకునే ప్రయత్నం అన్న భావన కనిపించాలి.
ఈ విషయాన్నే పవన్ పదే పదే చెబుతున్నారు. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ.. సహజ రాజకీయాలను గమనిస్తే.. తమిళనాడుకు ఏపీకి మధ్య కులాల కుంపట్ల తేడా కనిపిస్తుంది. దీనిని కూడా అర్ధం చేసుకోవాల్సిన జనసైనికులు వెనుకబడుతున్నారు.
ఎక్కడైనా కూడా.. అధినేత అడుగు జాడల్లో నడవడం వేరు… ఆయన వ్యూహాలను అర్ధం చేసుకోవడం వేరు. నిజానికి ప్రస్తుతం టీడీపీ, జనసేనల్లో చాలా స్వేచ్ఛ ఉంది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు వారి అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా ఉంది. దీనిని సద్వినియోగం చేసుకుని.. పవన్ అభిప్రాయాలను అర్ధం చేసుకుంటేనే.. జనసేనాని అర్ధమవుతాడు.
This post was last modified on May 27, 2026 4:35 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…