Movie News

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని అభిమానులు భావించినప్పటికీ టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన కాసేపటికే బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం శుభ సూచకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వరుణ్ గత డిజాస్టర్లు మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేశాయి. కొన్నింటికి సరైన ఓపెనింగ్ రాలేదు. సాయంత్రం షోకే డెఫిసిట్లు వేసిన మట్కా లాంటి వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇలాంటి టైంలో కొరియన్ కనకరాజు తనకు ఆక్సీజెన్ లా పని చేయాల్సిందే. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చిన ప్రమోషన్లు క్రమంగా బజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న బుకింగ్స్ వరుణ్ తేజ్ ఇమేజ్ తో కాకుండా, పబ్లిసిటీలో చూపించిన శాంపిల్స్ వల్ల ఆడియన్స్ దృష్టి దీని మీద పడేలా చేసింది. రెగ్యులర్ హారర్ డ్రామా తరహాలో వెళ్లకుండా రాయలసీమ కుర్రాడిలో కొరియన్ ఆత్మ ప్రవేశించడమనే వెరైటీ పాయింట్ తీసుకోవడం ఆడియన్స్ ని దీని వైపు తిప్పుతోంది.

రేపు అర్ధరాత్రి ఎలాంటి టాక్ వస్తుందనే దాని గురించి టీమ్ మొత్తం సస్పెన్స్ తో ఎదురు చూస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు నెక్స్ట్ డే మార్నింగ్ షో నుంచే బుకింగ్స్ ఊపందుకుంటాయి. ముఖ్యంగా కౌంటర్ సేల్స్ బిసి సెంటర్స్ లో బాగుంటాయి. ఎలాగూ చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న డిసికి జీరో బజ్ ఉంది. ఏదో అద్భుతం అనిపించే టాక్ వస్తే తప్ప తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓపెన్ కాదు.

దివంగత దర్శకుడు కేకే చివరి సినిమా కెజెక్యూ కూడా రేసులో ఉంది కానీ అది పూర్తి ఇంటెన్స్ డ్రామా కావడం వల్ల పోటీ పరంగా టెన్షన్ పడేందుకు లేదు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినా కొరియన్ కనకరాజుదే పై చేయి అవుతుంది కనక రెండో స్థానంలో కెజెక్యూ సెట్ అవుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కొరియన్ కనకరాజుతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు. తిరిగి స్టార్ హీరోలతో జట్టు కట్టాలంటే దీంతో ప్రూవ్ చేసుకోవాలి. మాటల్లో ఆ నమ్మకమైతే కనిపిస్తోంది.

This post was last modified on August 6, 2026 9:57 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

4 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

6 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

6 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

8 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

9 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

10 hours ago