Movie News

పుష్ప‌తో ఎలా ఫేట్ మారిందో చెప్పిన‌ సునీల్

సునీల్ అంటే కామెడీ.. కామెడీ అంటే సునీల్ అన్న‌ట్లుగా ఉండేది ఒక‌ప్పుడు తెలుగు సినిమాల్లో. కానీ త‌ర్వాత అత‌ను హీరోగా మారాడు. క్ర‌మంగా కామెడీ వేషాలు మానేశాడు. మొద‌ట్లో హీరోగా కొన్ని మంచి విజ‌యాలు అందుకున్నాడు కానీ.. త‌ర్వాత క‌థ అడ్డం తిరిగింది. హీరోగా వ‌రుస వైఫ‌ల్యాలు ఎదుర్కోవ‌డంతో మ‌ళ్లీ కామెడీ వేషాల వైపు మ‌ళ్లాల్సి వ‌చ్చింది. కానీ ఒక‌ప్ప‌ట్లా త‌న కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు. అలాంటి ద‌శ‌లో అనూహ్యంగా విల‌న్ వేషాల వైపు మ‌ళ్లాడు.

క‌ల‌ర్ ఫొటోలో విల‌న్ పాత్ర‌తో మెప్పించాక పుష్ప సినిమాతో సునీల్ ఫేట్ మారిపోయింది. అత‌ను బ‌హు భాషా న‌టుడిగా ఎదిగిపోయాడు. త‌మిళంలో ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మూవీ జైల‌ర్ స‌హా అర‌డ‌జ‌నుకు పైగా సినిమాల్లో న‌టించాడు సునీల్. క‌న్న‌డ‌లోనూ కిచ్చా సుదీప్ సినిమా మ్యాక్స్‌లో న‌టించాడు. తాజాగా మ‌ల‌యాళంలోనూ అడుగు పెట్టేశాడు.

ఈ మధ్య ఒక ఈవెంట్ లో పాల్గొన్న సునీల్ పుష్ప సినిమా త‌న జీవితాన్ని ఎలా మార్చేసిందో వివ‌రించాడు. ఆ సినిమాలో మంగ‌ళం శీను పాత్ర‌తో త‌న‌కు దేశ‌వ్యాప్తంగా ఎన‌లేని గుర్తింపు ల‌భించి, త‌న జీవితం మారిపోయింద‌ని సునీల్ తెలిపాడు. ఎప్పుడు ఏ భాష నుంచి ఎవ‌రు ఫోన్ చేసి సినిమా అవ‌కాశం ఇస్తారో తెలియ‌ని విధంగా అయిపోయింద‌ని సునీల్ న‌వ్వుతూ వ్యాఖ్యానించాడు.

త‌మిళంలో చాలా సినిమాల్లో న‌టించాక మ‌ల‌యాళంలోనూ అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అక్క‌డ తాను త‌మిళుడిని అనుకుని సీన్ పేప‌ర్ ఆ భాష‌లోనే ఇచ్చార‌ని సునీల్ గుర్తు చేసుకున్నాడు. ఇన్ని భాష‌ల్లో త‌న‌ను ఆద‌రిస్తుండ‌డం ప‌ట్ల సునీల్ ఆనందం వ్య‌క్తం చేశాడు. వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోయే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ మూవీ జ‌న‌నాయ‌గ‌న్‌లోనూ సునీల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌డం విశేషం.

This post was last modified on May 26, 2026 11:58 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago