Political News

విజయ్ వెంట పడడం మొదలెట్టిన డీఎంకే

తమిళనాడులో రాజకీయాలు వేడి వేడిగా వున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష డీఎంకే తరచుగా ఏదో ఒక వివాదం రాజేసేందుకు ప్రయత్నిస్తుంది. అడ్డగోలు కామెంట్స్ చేసి రోడ్డు మీద పడుతుంది. నిజానికి విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు. ఈ ఏడాది మే 10 వ తేదీన చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది పాటు విమర్శలు చేయకుండా ఒదిలి పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దీన్ని హనీమున్ పిరియడ్ గా అభివర్ణింస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష డీఎంకే తొలిరోజు నుంచే విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మొదట్నుంచి నోరు పారేసుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చేసిన, చేస్తున్న విమర్శల పట్ల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

తాజాగా ముఖ్యమంత్రి విజయ్ స్నేహితురాలు, సినీ నటి త్రిష గురించి మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయాల పట్ల విమర్శలు చేయడంతో టీవీకే పార్టీతో పాటుగా మిగిలిన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. ఇక పార్టీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. టీవీకే నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో చెన్నైలో ఉదయనిధిని అరెస్టు చేశారు. హై డ్రామా మధ్య సెంగిపట్టి పోలీసు స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు విచారించి పోలీసుల విచారణకు సహకరించాలని షరతుపెట్టి వదిలిపెట్టారు.

కుమారుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మాజీ ముఖ్యమంత్రి స్థాలిన్ ముఖ్యమంత్రి విజయ్ ని ఒక డమ్మీ ముఖ్యమంత్రి అని విమర్శించారు. అంతటితో ఆగకుండా సీఎం విజయ్ రీల్ క్రియేటర్ గానే ఎక్కువగా గడుపుతున్నారని మండిపడ్డారు. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలు సైతం రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఒక వర్గం సీఎం విజయ్ కు మద్దతు పలకగా మరో వర్గం ఉదయనిధి అరెస్టును ఖండిస్తుంది.

This post was last modified on August 5, 2026 11:15 pm

Share

Recent Posts

ఎంఎస్ సుబ్బులక్ష్మి… వాళ్ళిద్దరికీ పెద్ద ఛాలెంజ్

రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…

44 minutes ago

మనోళ్లకు మండాడి అంతెందుకు నచ్చింది

నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…

2 hours ago

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

4 hours ago

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

4 hours ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

5 hours ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

6 hours ago