వైసీపీ అధినేత జగన్ పర్యటనల్లో భాగంగా ఇటీవల కాలంలో `రప్పా-రప్పా` డైలాగులు తరచుగా వినిపించేవి. రప్పా-రప్పా అని రాసున్న బ్యానర్లు, ప్లకార్డులు కూడా దర్శనమిచ్చాయి. అయితే.. ఇవి సమాజాన్ని రెచ్చగొట్టేలా ఉండడం.. రౌడీయిజాన్ని పెంచేలా ఉండడంతో పోలీసులు ఈ వ్యాఖ్యలు సహా.. ఈ బ్యానర్లను కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటీవలి జగన్ పర్యటనల్లో రప్పా-రప్పా బ్యానర్లు మాయమయ్యాయి. వీటి స్థానంలో కొత్తవి చోటు చేసుకున్నాయి.
ఇటీవల వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం వెళ్లారు. ఈ సమయంలో కూడా రప్పా-రప్పా బ్యానర్లు కనిపించలేదు. యువత కూడా.. రప్పా-రప్పా అని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించలేదు. ఇక, తాజాగా బుధవారం మాజీ సీఎం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. పొగాకు రైతులకు మద్దతు ధరలు రావడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. రైతులను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఆయన దేవరపల్లికి చేరుకున్నారు.
ఈ సమయంలో భారీగా కార్యకర్తలు, మహిళలు జగన్ పర్యటనకు వచ్చారు. ఈ సమయంలో రప్పా-రప్పా బ్యానర్ల స్థానంలో వినూత్నంగా బ్యానర్లు కనిపించాయి. “నువ్వే మా రారాజు. నువ్వే మా దేవుడు. నీతోనే మేం నడుస్తాం.“ అని రాసున్న ప్లకార్డులను పలువురు మహిళలు, యువత కూడా ప్రదర్శించారు. మరోవైపు.. పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. తొలుత అనుమతి లేదని చెప్పినా.. చివరి నిమిషంలో అనుమతి ఇచ్చారు. నేరుగా దేవరపల్లికి హెలికాప్టర్‌లో వెళ్లిన జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సమయంలో పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు.. జగన్ దేవుడంటూ.. కొనియాడారు. ఆయన పాలన తిరిగి వస్తుందని రాసి ఉన్న బ్యానర్లు పట్టుకుని కనిపించారు. అయితే.. మరోవైపు రప్పా-రప్పా అని రాసి ఉన్న ప్లకార్డులు కానీ, బ్యానర్లు కానీ కనిపిస్తాయేమోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బ్యానర్లు, ప్లకార్డులు కనిపిస్తే.. సదరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంను రంగంలోకి దింపారు. కానీ .. పోలీసుల ఎఫెక్ట్‌తో రప్పా-రప్పా బ్యానర్లు కనిపించకపోవడం గమనార్హం.
This post was last modified on August 5, 2026 10:14 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…