Movie News

క్రైమ్ సినిమాలు ఇంకెన్ని తీస్తారయ్యా

మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా ఒకే మూసలో వెళ్లడాన్ని అంతగా గమనించం. అందుకే ఓటిటిలో ఎన్ని ప్రశంసలు తెచ్చుకున్నా వాటిని డబ్ చేసి ఇక్కడి థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం మనోళ్లు చేయరు. ఒకవేళ ధైర్యం చేసి రిస్క్ తీసుకున్నా కుంచక్ బోబన్ హీరోగా వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ లాగా కాసిన్ని ప్రశంసలు తప్ప బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రావు గాక రావు.

ఇప్పుడీ టాపిక్ కి కారణం ‘ఉయిర్’ అనే కొత్త మూవీ. ఇటీవలే నేరుగా ఓటిటిలో రిలీజయ్యింది. కథ సింపుల్. ఒక పాడుబడిన బావిలో స్త్రీ శవం దొరుకుతుంది. అది ఎవరిదని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ప్రొబెషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి లోతుగా వెళ్లే కొద్దీ షాకింగ్ నిజాలు తెలుస్తాయి. హత్య తర్వాత ఆమె పిల్లలు ముంబైలో ఉన్నారని తెలుసుకుని, వెతికి తీసుకొచ్చి డిపార్ట్ మెంట్ తో శభాష్ అనిపించుకుంటాడు. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు, సంఘటనల సమూహారమే తాజాగా వచ్చిన ఉయిర్.

రోషన్ మాతివ్ హీరోగా నటించగా నటీనటులంతా కేరళ బ్యాచే కనిపిస్తారు. కథ కథనం పరంగా ఎలాంటి కొత్తదనం ఉండదు. ఓ రెండు మూడు మలుపులు తప్ప రెండుంపావు గంటల మూవీలో సాగదీసిన సీన్లే ఎక్కువగా ఉంటాయి. అయినా ఇన్నేసి పోలీస్ క్రైమ్ సినిమాలు ఒక్క మల్లువుడ్ లోనే తీస్తున్నారనిపిస్తుంది. తలవన్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఇరట్ట, క్రిస్టోఫర్, పొప్పన్, సెల్యూట్, కుట్టవుమ్ శిక్షయుమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది.

కొన్నేళ్ల క్రితం నాయట్టు అనే హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. ఓ సంవత్సరం తర్జన భర్జనల తర్వాత శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ గా తీస్తే మనోళ్లు లైట్ తీసుకున్నారు. అయినా అక్షరాస్యత ఎక్కువగా ఉండే కేరళలో క్రైమ్ రేట్ కూడా ఎక్కువే కాబోలు. అందుకే ఖాకీ విచారణల మీద ఇన్నేసి చిత్రాలు వస్తున్నా చూస్తూనే ఉన్నారు. మనకు ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అలా బుల్లితెర మీద లాగించేయవచ్చు. 

This post was last modified on August 5, 2026 9:37 pm

Share

Recent Posts

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

1 hour ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

2 hours ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

2 hours ago

రామాయ‌ణం.. ర‌ణ‌బీర్… ర‌బ్బ‌ర్ చెప్పులు

పురాణ గాథ‌ల‌ను తెర‌కెక్కించేట‌పుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విష‌యం…

3 hours ago

జ‌గ‌న్ భద్రతపై వైసీపీ నేతల ఆందోళన

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా బుధ‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా దేవ‌ర‌ప‌ల్లిలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డి పొగాకు రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. తొలుత…

3 hours ago

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…

3 hours ago