Movie News

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని వల్ల సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రమాదంలో పడింది. వాటి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఐతే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ రేటు తక్కువ అని సింగిల్ స్క్రీన్లకే వెళ్తున్నారు. దీనికి తోడు సింగిల్ స్క్రీన్లను రెనొవేట్ చేసి మల్టీప్లెక్స్‌కు దగ్గరగా ఉండే విజువల్, సౌండ్ క్వాలిటీ ఇచ్చే ప్రయత్నమూ జరుగుతోంది. ఇలా కొంత మేర సింగిల్ స్క్రీన్లు మనగలుగుతున్నాయి.

కానీ ఇప్పుడు వాటి మనుగడనూ ప్రమాదంలోకి నెట్టేలా మల్టీప్లెక్స్ జెయింట్ పీవీఆర్ ఒక సంచలన అడుగు వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ దేశవ్యాప్తంగా 300 కొత్త స్క్రీన్లను అందుబాటులోకి తేబోతోందట. తక్కువ సైజుతో, మెయింటైనెన్స్ తక్కువ ఉండేలా ఆ స్క్రీన్లను నిర్మించనుందట. అన్నింటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. ఈ స్క్రీన్లలో టికెట్ ధర తక్కువ ఉంటుందట.

175 రూపాయల ఫ్లాట్ టికెట్ రేటుతో ఈ 300 స్క్రీన్లను అందుబాటులోకి తేనుందట పీవీఆర్. ప్రస్తుతం తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.295గా ఉంది. ఏపీలో మల్టీప్లెక్స్ టికెట్ రేటు రూ.177. కొన్ని ప్రీమియం మల్టీప్లెక్సుల్లో కాస్త రేటు ఎక్కువగా ఉంటోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఎక్కువ రేట్లున్న రాష్ట్రాలూ ఉన్నాయి. ఐతే దేశంలోని అన్ని మేజర్ సిటీస్‌లోనూ పీవీఆర్ జనతా స్క్రీన్లు రాబోతున్నాయి. ఈ మూడొందల స్క్రీన్లలోనూ ఫ్లాట్ రూ.175 రేటే ఉండబోతోంది.

రీజనబుల్ రేటుతో మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆకర్షితులవుతారు. ఇది సింగిల్ స్క్రీన్ల మనుగడను సవాలు చేస్తుందనడంలో సందేహం లేదు. త్వరలోనే వీటి నిర్మాణం మొదలుపెట్టి వీలైనంత త్వరగా ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని పీవీఆర్ చూస్తోంది. టికెట్ల ధరలతో పాటు పాప్ కార్న్, స్నాక్స్ ధరలు కూడా రీజనబుల్‌గా ఉండేలా చూసుకుంటే ఈ స్క్రీన్లు సూపర్ హిట్ కావడం ఖాయం.

This post was last modified on August 5, 2026 11:25 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago