డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ ఈ జాబితాలోకే చేరింది. రెండు వారాల ముందు ఈ చిత్రానికి రిలీజ్ ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. ఆ షోల నుంచి అంత గొప్ప టాకేమీ రాలేదు. సెకండాఫ్ విషయంలో బాగా నెగెటివ్ టాక్ వచ్చింది. ఓవరాల్‌గా సినిమా యావరేజ్ అనే అన్నారు. కానీ ఈ చిత్రం డివైడ్ టాక్‌ను తట్టుకుని బలంగానే నిలబడింది.
తొలి వీకెండ్లో అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. తర్వాత కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టినా.. రెండో వీకెండ్లో పుంజుకుంది. ‘స్పైడర్ మ్యాన్’ పోటీని కూడా తట్టుకుని మంచి షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పుడీ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగింపుకి వచ్చేసింది. ఈ వారం ‘కొరియన్ కనకరాజు’ లాంటి క్రేజీతో పాటు ఇంకో రెండు సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ‘చెన్నై లవ్ స్టోరీ’కి చెప్పుకోదగ్గ వసూళ్లు రాకపోవచ్చు.
‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రూ.25 కోట్ల మేర షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా రేంజికి అది డీసెంటే. సినిమాను కొన్ని బయ్యర్లందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారు. కొంత లాభాలూ అందుకున్నారు. నిర్మాతలకూ లాభాలు వచ్చాయి.
కొన్ని ఏరియాలను అమ్మేసి, కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుని ఓవరాల్‌గా రూ.10 కోట్లకు తక్కువ కాకుండా లాభం అందుకున్నారు. కానీ ‘బేబి’ కాంబినేషన్ నుంచి వచ్చిన సినిమాతో ఇంకా మంచి ఫలితం అందుకోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీసిన మేకర్స్ నుంచి వచ్చిన సినిమా ఇది. పైగా హీరో మార్కెట్ కూడా యాడ్ అయింది. అంటే సినిమా ఇంకా పెద్ద రేంజికి వెళ్లాలి. లేదా ‘బేబి’కి దగ్గరగా అయినా వసూళ్లు రాబట్టాలి. కానీ అలా జరగలేదు.
మేకర్స్ ‘కల్ట్ క్లాసిక్’ అంటూ ఊదరగొట్టారు కానీ.. ఆ స్టేటస్‌కు దగ్గర్లో కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. వచ్చిన టాక్‌తో పోలిస్తే మెరుగైన వసూళ్లు సాధించిందన్న మాటే కానీ.. మేకర్స్ అంచనా వేసినట్లు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయలేదు. అలాగే ఒక మరపురాని చిత్రంగానూ గుర్తింపు తెచ్చుకోలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘చెన్నై లవ్ స్టోరీ’ మేకర్స్‌కు ‘సమ్’తృప్తే మిగిల్చింది.
This post was last modified on August 5, 2026 11:18 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…